MARYADA PURSHOTTAMA RIDES SARVABHOOPALA _ సర్వభూపాల వాహనంపై శ్రీరామచంద్రమూర్తి అభయం
Tirupati, 16 Mar. 21: Maryada Purushottama Rama took a majestic ride as Universal Supremo on Sarvabhoopala Vahanam on the fourth day evening as part of ongoing annual brahmotsavams at Sri Kodanda Rama Swamy temple in Tirupati on Tuesday evening.
In view of Covid, the annual brahmotsavams in this ancient temple are taking place in Ekantam.
Special Gr DyEO Smt Parvathi and other office staff members were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సర్వభూపాల వాహనంపై శ్రీరామచంద్రమూర్తి అభయం
తిరుపతి, 2021 మార్చి 16: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మంగళవారం రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమిచ్చారు. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ కార్యక్రమం రాత్రి 8 నుండి 9 గంటల వరకు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు
సర్వభూపాలురు అంటే అందరు రాజులు అని అర్థం. ”రాజా ప్రజారంజనాత్” అన్నట్లు ప్రజలను రంజింపజేసేవారే రాజులు. ఈ రాజులందరికీ రాజాధిరాజు భగవంతుడు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.