MEDIA CENTRE & EXHIBITION INAUGURATED _ మీడియా సెంటర్‌, ప్రదర్శనశాలలను ప్రారంభించిన టిటిడి ఛైర్మన్‌, ఈవో

Tirumala, 13 September 2018: The media centre set up by TTD in view of annual brahmotsavams, was inaugurated by TTD EO Sri Anil Kumar Singhal and Tirumala JEO Sri KS Sreenivasa Raju on Thursday evening.

During every brahmotsavams, TTD arranges a media centre in Rambhageecha 2 rest house for the convenience of media persons who are coming for wide coverage of annual fete from different states across the country.

TTD PRO Dr T Ravi was also present.

Later the CHAIRMAN ,EO and JEO also opened up the Brahmotsavam exhibitions arranged at Kalyana Vedika. TTD has set up colourful diaromas with varieties of flowers, the sand art sculpture, museum, photography, Ayurveda departments have also placed their artistic works.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మీడియా సెంటర్‌, ప్రదర్శనశాలలను ప్రారంభించిన టిటిడి ఛైర్మన్‌, ఈవో

సెప్టెంబరు 13, తిరుమల 2018; శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని రాంభగీచా-2 విశ్రాంతిగృహంలో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్‌, కల్యాణవేదిక వద్ద ఏర్పాటుచేసిన ప్రదర్శనశాలలను గురువారం సాయంత్రం టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ప్రారంభించారు.

బ్రహ్మోత్సవాల వైభవాన్ని, ఇతర విశేషాలను ఎప్పటికప్పుడు భక్తులకు చేరవేసేందుకు టిటిడి మీడియా సెంటర్‌ను ఏర్పాటుచేసింది. ఇక్కడ మీడియా ప్రతినిధులకు భోజన సదుపాయంతో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్‌, ఫ్యాక్స్‌, టెలిఫోన్‌ వసతి కల్పించారు. ప్రతిరోజూ మీడియా సెంటర్‌లో వివిధ విభాగాల అధికారులు మీడియా సమావేశాలు నిర్వహిస్తారు.

తిరుమలలోని కల్యాణవేదిక వద్ద ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్‌, టిటిడి ప్రచురణల ప్రదర్శన, విక్రయం, ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఫలపుష్ప ప్రదర్శన, ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసి, అటవీ విభాగం ఆధ్వర్యంలో వనమూలికా ప్రదర్శన, ఎస్వీ మ్యూజియం ప్రదర్శన, శ్రీవేంకటేశ్వర శిల్పకళాశాల ఆధ్వర్యంలో శిల్పకళా ప్రదర్శనలను ఏర్పాటుచేశారు. ఇక్కడ ఏర్పాటుచేసిన వామనుడి సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌నాయుడు, మ్యూజియం అధికారి శ్రీ రంగనాయకులు, గార్డెన్‌ సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.