DEVOTIONAL SONGS ENTHRALL AUDIENCE _ తిరుపతిలో బ్రహ్మోత్సవాల సాంస్కృతిక శోభ

Tirupati, 13 September 2018: The devotional songs organised by TTD at Mahati, Annamacharya Kalamandiram, Ramachandra Pushkarini in Tirupati in connection with annual brahmotsavams at Tirumala on Thursday.

The musical concert by Smt Padmasugavanam, Flute by Smt Lakshmi troupe and Smt Dwaram Lakshmi in the respective places enthralled audience.



ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుపతిలో బ్రహ్మోత్సవాల సాంస్కృతిక శోభ

సెప్టెంబరు 13, తిరుపతి 2018;ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు తిరుపతివాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటుచేశారు.

ఇందులో భాగంగా మొదటిరోజైన గురువారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.00గంటల వరకు బెంగళూరుకు చెందిన శ్రీమతి పద్మ సుఘవనం బృందం చక్కటి భక్తి సంగీతం వినిపించారు.

అదేవిధంగా అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి వి.లక్ష్మీ బృందం వేణుగానం వాద్య సంగీతం వినిపించారు. రామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి ద్వారం వి.జె.లక్ష్మి బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.