MEETING HELD _ చక్రస్నానం పై అధికారులకు టీటీడీ ఈఓ దిశా నిర్దేశం

TIRUMALA, 11 OCTOBER 2024: In view of Chakrasnanam at Tirumala on Saturday, the TTD EO Sri J. Syamala Rao along with the Additional EO Sri Ch Venkaiah Chowdhary held a meeting with sectoral and deputation officers.

The meeting was held at Astana Mandapam in Tirumala on Friday wherein the EO asked all the officers to discharge duties with the same spirit and make it a huge success akin to Garuda Seva.

Inspection 

Later the officers along with the deputed staff visited Swamy Pushkarini to see the arrangements.

JEOs Smt Goutami, Sri Veerabrahmam, CVSO Sri Sridhar and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చక్రస్నానం పై అధికారులకు టీటీడీ ఈఓ దిశా నిర్దేశం

తిరుమల, 2024 అక్టోబ‌రు 11: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నాన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని అధికారులను టీటీడీ ఈఓ శ్రీ జె.శ్యామలరావు ఆదేశించారు. చక్రస్నాన ఏర్పాట్లపై టీటీడీ అధికారులతో శుక్రవారం తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ చక్రస్నాన సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. భక్తులందరికీ చక్రస్నాన సమయంలో బాదం పాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. పుష్కరిణీకి నలువైపులా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. సిబ్బంది సంయమనంతో భక్తులకు సహకరించి చక్రస్నాన ఘట్టాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈఓ శ్రీ సీ.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సీపీఆర్వో శ్రీ రవి, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.