MEETING ON SECURITY AUDIT HELD _ తిరుమలలో భద్రతపై ఉన్న‌తస్థాయి సమీక్ష

TIRUMALA, 15 MAY 2025: A high-level meeting on Security Audit was held at Annamaiah Bhavan in Tirumala on Thursday.

The meeting, attended by top officials from the Police, TTD and other security forces, led by DIG (Anantapur Range) Dr Shemushi, and discussed in elaborate on the proposed comprehensive security audit and a few proposals which were already implemented in Tirumala. 

Speaking in the meeting, the DIG said the security audit is intended to enhance the overall security setup at the Tirumala temple, especially in view of the recent terror strikes in Pahalgam. She said, the motto is to further strengthen security arrangements at the Tirumala temple. With a seamless coordination, we should safeguard the sentiments of the devotees which should be the ultimate goal of this meeting, she asserted.

Earlier, the Tirupati Urban SP and TTD CVSO In-charge Sri Harshavardhan Raju explained in detail through a power point presentation, the various proposals made during the earlier Security Audit that took place in May 2023 and the changes which are being contemplated in view of the recent incidents for the safety and security of Tirumala temple and environs. 

He said there is a need to bring all the Security Agencies including APSP, DAR, SPF, HGs, Civil Police and TTD Security under one umbrella by developing separate SOP for each working agency. He also felt that all the Access Control Teams including the Private Security need to be trained. Security in outer cordon, especially in the 14 entry points to Seshachala forests including Talakona, Mamandur, Tumburu Theertham, Mangalam routes need to be beefed up.

The meeting also felt the need to train the security staff on Chemical Biological Radiological Nuclear(CRBN) threats besides Anti-sabotage measures and taking up mock drills and evacuation drills at regular intervals.

Among other officers, Dr Garud Sumit Sunil-SP Grey Hounds(Commander), Sri Arif Hafeez-SP ISW, Sri Vivek Anand-DFO Tirupati and many other top brass officials from different security agencies, TTD Vigilance and Security, other departments were also present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

తిరుమలలో భద్రతపై ఉన్న‌తస్థాయి సమీక్ష

తిరుమ‌ల‌, 2025 మే 15: తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో గురువారం తిరుమ‌ల భద్రత‌పై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పోలీసు శాఖ, టీటీడీ, ఇతర భద్రతా విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతపురం రేంజ్ డీఐజీ డా.షెమూషి అధ్యక్షతన ఈ సమావేశం జ‌రిగింది.

ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ, ఇటీవల పహల్గాం ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలో భద్రతను మరింత బలోపేతం చేయడమే భద్రతా ఆడిట్ ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. అన్ని భద్రతా దళాలు మరియు టీటీడీ విభాగాల సమన్వయంతో పనిచేస్తూ, భక్తుల మ‌నోభావాలను కాపాడట‌మే ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు.

అంతకు ముందు టీటీడీ ఇన్‌ఛార్జి సీవీఎస్వో మ‌రియు తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు 2023 మే నెలలో నిర్వహించిన భద్రతా ఆడిట్ సమీక్షలో చేసిన ప్రతిపాదనలు, అలాగే ఇటీవల ఏర్పడిన పరిస్థితుల ఆధారంగా చేపట్టాల్సిన మార్పులు అనే విషయాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సుదీర్ఘoగా వివరించారు.

అలాగే, ఏపీఎస్పీ, డీఏఆర్, ఎస్పీఎఫ్, హోం గార్డులు, సివిల్ పోలీసు, టీటీడీ భద్రతా సిబ్బంది వంటి అన్ని భద్రతా దళాలను సమన్వయ పరచి ప్రతి ఒక్క దళానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది సహా అన్ని యాక్సెస్ కంట్రోల్ బృందాలకు తగిన శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందని అన్నారు.

తలకోన, మామండూరు, తుంబురు తీర్థం, మంగళం మార్గాలు సహా శేషాచల అటవీ ప్రాంతానికి చెందిన 14 ప్రవేశ ద్వారాలలో భద్రతను మరింత పటిష్టం చేయాలని సూచించారు.

అలాగే, భద్రతా సిబ్బందికి రసాయన, జీవ, కిరణ, అణు ముప్పులపై శిక్షణ(CBRN), యాంటీ సాబటేజ్ చ‌ర్య‌లు, మాక్ డ్రిల్లులు, ఎవాక్యుయేషన్ డ్రిల్లులు వంటి అంశాలపై శిక్షణలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈ సమావేశంలో గ్రేహౌండ్స్ (కమాండర్) ఎస్పీ డా. గరుడ్ సుమిత్ సునీల్, ఐఎస్‌డ‌బ్ల్యూ ఎస్పీ శ్రీ అరిఫ్ హఫీజ్, తిరుపతి డీఎఫ్ఓ శ్రీ వివేక్ ఆనంద్, వివిధ భద్రతా దళ అధికారులు, టీటీడీ విజిలెన్స్‌, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డిన‌ది.