MEETING WITH FOREST FIRE ADVISORY COMMITTEE HELD _ అగ్నిప్ర‌మాదాల నివార‌ణ‌కోసం టిటిడి అట‌వీ స‌ల‌హా మండ‌లి స‌మావేశం

TIRUMALA, 25 MARCH 2022:  With the advent of summer season, where the incidences of forest fires are usually common between March and July in Tirumala, TTD has geared up to face the challenges if any.

A review meeting with the Forest and TTD officials was held by the TTD Additional EO Sri AV Dharma Reddy at Annamaiah Bhavan in Tirumala on Friday. Addressing the meeting, the Additional EO said, after a series of Forest Fire accidents in Tirumala forests that fall under the purview of TTD, a committee with the Additional EO as the Chairman and DFO as member Convenor with experts has been constituted to counter action and arrest such fire mishaps in the deep woods.

He said in the last one decade about 50 forest fire incidents have taken place with the maximum of 14 being registered in 2016. The Additional EO said, a comprehensive action plan was prepared which included zoning of forest areas based on fire vulnerabilities, formation of control lines, deployment and training of forest teams, latest fire fighting gadgets with advanced technology, long-term measures to improve bio-diversity etc.

AP State Bio-diversity Chairman Sri BMK Reddy and retired CCF Sri N Chandramohan Reddy who participated in the meeting virtually made some valuable suggestions which included mapping of forest zones with the help of FSI, florestic and faunal inventories to assess the standing growth and bio-diversity of TTD forests, soil and moisture conservation mechanism. He also appreciated TTD’s decision to replace Acacia auriculiformis with fruit, nectar, fruit yielding plants in about 582 hectares of land at Rs.32crores.

Earlier, Devasthanam Forest Officer Sri Srinivasulu Reddy, briefed on the TTD forest cover in Seshachala ranges and the forest fire arresting techniques being used by TTD both in Tirumala and also in Tirupati, manpower deployment details, sandalwood plantation etc.through power point presentation.

 The Additional EO also directed the DFO to take the expert advice to improve the aves population in Tirumala by effectively taking up bio-diversity initiatives. 

District Forest officials Sri Nageswara Rao, Sri Pavan Kumar, Smt Hima Sailaja were also present.

Later a review meeting on the ongoing development activities with Engineering, Estate, Vigilance officials was also held.

CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, EEs Sri Jaganmohan Reddy, Sri Surendranath Reddy, DE Electrical Sri Ravishankar Reddy, Estate Officer Sri Mallikarjuna, Gosala Director Sri Harnath Reddy, VGO Sri Bali Reddy and others were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అగ్నిప్ర‌మాదాల నివార‌ణ‌కోసం టిటిడి అట‌వీ స‌ల‌హా మండ‌లి స‌మావేశం

తిరుమల, 2022 మార్చి 25: వేస‌విలో మార్చి నుండి జులై నెల‌ల మ‌ధ్య తిరుమ‌ల శేషాచ‌లం అడ‌వుల్లో అగ్నిప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశం ఉండ‌డంతో స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేందుకు టిటిడి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. ఇందులో భాగంగా టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఆధ్వ‌ర్యంలో తిరుమల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం టిటిడి అట‌వీ స‌ల‌హా మండ‌లి స‌మావేశం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ టిటిడి పరిధిలోని అట‌వీ ప్రాంతంలో వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడంతో, ఇలాంటి ఘ‌ట‌న‌ల నివారణకు అద‌న‌పు ఈవో చైర్మన్‌గా, డిఎఫ్‌వో మెంబర్‌ కన్వీనర్‌గా నిపుణులతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. గత దశాబ్ద కాలంలో దాదాపు 50 అటవీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, 2016లో అత్యధికంగా 14 నమోదయ్యాయని ఆయన తెలిపారు. అగ్ని ప్రమాదాల ఆధారంగా అటవీ ప్రాంతాలను జోన్లుగా విభ‌జించ‌డం, నియంత్రణ ఏర్పాట్లు, ఫైర్‌లైన్లు, ఫైర్ ఫైటింగ్ బృందాల‌కు శిక్ష‌ణ, అధునాతన సాంకేతికతతో కూడిన అగ్నిమాపక యంత్రాలు స‌మ‌కూర్చ‌డం, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌లు త‌దిత‌ర అంశాల‌తో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామని చెప్పారు.

సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ శ్రీ బిఎంకె.రెడ్డి, రిటైర్డ్ సిసిఎఫ్‌ శ్రీ ఎన్‌.చంద్రమోహన్ రెడ్డి ప‌లు విలువైన సూచనలు చేశారు. ఇందులో ఫారెస్ట్ స‌ర్వే ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఐ)తో అనుసంధానం కావ‌డం ద్వారా అగ్ని ప్ర‌మాదాల స‌మాచారాన్ని వెంట‌నే తెలుసుకోవ‌డంతోపాటు అటవీ జోన్ల‌ను మ్యాపింగ్ చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. ప‌క్షులు, జంతువుల వృద్ధిని అంచనా వేయాల‌ని, నేల‌లో తేమశాతాన్ని పెంచాల‌ని కోరారు. రూ.32 కోట్ల వ్య‌యంతో దాదాపు 582 హెక్టార్ల భూమిలో అకేషియా చెట్ల స్థానంలో సంప్ర‌దాయ ర‌కాలైన పుష్పాలు, పండ్ల మొక్కలను నాటేందుకు టీటీడీ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు.

అంతకుముందు టిటిడి డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాసులురెడ్డి శేషాచల అడవుల్లో టిటిడి అటవీ విస్తీర్ణం, తిరుమల, తిరుపతిలో అగ్నిప్ర‌మాదాల నివార‌ణ‌కు కోసం టిటిడి చేపడుతున్న ఏర్పాట్ల‌ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జీవ‌వైవిధ్యం కోసం చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం ద్వారా ప‌క్షిజాతుల సంఖ్యను పెంచాల‌ని, ఇందుకోసం నిపుణుల సలహాలు తీసుకోవాలని డిఎఫ్‌ఓను అదనపు ఈవో ఆదేశించారు.

అనంతరం టిటిడి ఇంజినీరింగ్, ఎస్టేట్, విజిలెన్స్ విభాగాల అధికారులు, జిల్లా అటవీ శాఖ అధికారులతో పలు అభివృద్ధి పనులపై అదనపు ఈఓ చర్చించారు.

ఈ స‌మావేశంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఇఇలు శ్రీ జగన్మోహన్ రెడ్డి, శ్రీ సురేంద్రనాథ్ రెడ్డి, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ రెడ్డి, ఎస్టేట్ అధికారి శ్రీ మల్లికార్జున, విజిఓ శ్రీ బాలిరెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారులు శ్రీ నాగేశ్వరరావు, శ్రీ పవన్ కుమార్, శ్రీమతి హిమ శైలజ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.