MIXED ARTFORMS DISPLAYED _ ముత్య‌పు పందిరి వాహనసేవలో ఆకట్టుకున్న కళాబృందాల ప్రదర్శన

Tirumala, 17 October 2023: It’s a Jugalbandi of traditional and modern arts performed in front of Mutyapu Pandiri Vahana Seva on Tuesday evening.

A total of 392 artistes belonging to 15 teams from various states performed different Artforms which included folk, classical and modern arts which allured pilgrims.

On one hand Mahishasura Mardani was displayed by artistes from East Godavari, while Pondicherry artistes performed Radha Krishna Nrityam and Chennai team Navashakti Nrityam, from Karnataka Modern artform with a folk touch Roaster Dance was enacted.

Others included folk arts like Kolatam, Mohini Attam, Karakattam etc.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

ముత్య‌పు పందిరి వాహనసేవలో ఆకట్టుకున్న కళాబృందాల ప్రదర్శన

తిరుమల, 2023 అక్టోబ‌రు 17: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన మంగవారం రాత్రి ముత్య‌పు పందిరి వాహనసేవలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలు ఇచ్చాయి.

తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులు భరతనాట్యాన్ని ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు.

తమిళనాడుకు చెందిన రాజ బృందం శ్రీ కృష్ణ వైభవాన్ని అత్యంత మనోహరంగా ప్రదర్శించారు. పాండిచ్చేరికి చెందిన విచిత్ర బృందం మోహిని యట్టం ప్రదర్శించారు. చెన్నైకి చెందిన సుమన ఆధ్వర్యంలో కరకట్టం అనే సంప్రదాయ జానపద నృత్యం , నామ రామాయణం రూపకాన్ని ప్రదర్శించి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. చెన్నైకి చెందిన సెల్వం బృందం జానపద నృత్యం,
చెన్నైకి చెందిన విక్రమ్ ఆధ్వర్యంలో సంప్రదాయ కళల రూపకాన్ని ప్రదర్శించి చూపరులను విశేషంగా ఆకట్టుకున్నారు.

తూర్పుగోదావరికి చెందిన జి.భవాని శిరీష బృందం మహిషాసుర మర్దిని రూపకాన్ని ప్రదర్శించి భక్తులను అలరించారు. పాండిచ్చేరికి చెందిన మాలతి బృందం రాధాకృష్ణ నృత్యంతో కనువిందు చేశారు. కర్ణాటక రాష్ట్రం, ఆవేరి జిల్లాకు చెందిన మంజునాథ్ బృందం రోస్టర్ డాన్స్ ను ప్రదర్శించారు. బెంగుళూరుకు చెందిన
సతీష్ బృందం డొల్లు కునిత అనే జానపద కళారూపాన్ని ప్రదర్శించి భక్తులను అలరించారు. చెన్నైకి చెందిన లత బృందం నవశక్తి నృత్యాన్ని ప్రదర్శించి కనువిందు చేశారు.

ఖమ్మం జిల్లాకు చెందిన సైదులు బృందం కోలాటంతో అలరించారు. తిరుపతికి చెందిన మురళీకృష్ణ బృందం రామరాజ్యం రూపకంతో అలరించారు. తిరుమల బాలాజీ నగర్ కు చెందిన డి.శ్రీనివాసులు బృందం కోలాటంతో అలరించారు.

ముత్య‌పు పందిరి వాహనసేవలో 15 కళాబృందాలు, 392 మంది కళాకారులు పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.