MULTI DIMENSIONAL DISINFECTANT VEHICLE LAUNCHED _ శ్రీ‌వారికి మ‌ల్టీ డైమెన్ష‌న‌ల్ వెహిక‌ల్ మౌన్‌టెడ్ స్ప్రెయ‌ర్‌ విరాళం

Tirumala, 18 Mar. 20: A Rs.2.60 lakh worth Multi Dimensional Vehicle Mounted Sprayer has been donated to TTD by a devotee Sri Abdul Ghani.

The vehicle will be extensively used in mass spraying of disinfectants while cleaning.

Additional EO Sri AV Dharma Reddy performed puja to the vehicle in front of Vahana Mandapam. Health Officer Dr RR Reddy was also present. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

 

శ్రీ‌వారికి మ‌ల్టీ డైమెన్ష‌న‌ల్ వెహిక‌ల్ మౌన్‌టెడ్ స్ప్రెయ‌ర్‌ విరాళం

తిరుమల, 2020 మార్చి 18: తిరుమల శ్రీవారికి బుధ‌వారం సాయంత్రం మ‌ల్టీ డైమెన్ష‌న‌ల్‌ వెహిక‌ల్ మౌన్‌టెడ్ స్ప్రెయ‌ర్‌ విరాళంగా అందింది. శ్రీ అబ్దుల్ ఘ‌నీ అనే దాత రూ.2.60 ల‌క్ష‌ల విలువైన స్ప్రెయ‌ర్‌ అందజేశారు.

శ్రీవారి ఆలయం ఎదుట అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం వెహిక‌ల్ మౌన్‌టెడ్ స్ప్రెయ‌ర్ ద్వారా తిరుమ‌ల‌లోని ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో రోగ నివార‌ణ మందుల‌ను పిచికారి చేశారు. దీని ద్వారా వేగంగా త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ ఎత్తు వ‌ర‌కు, మ‌నుషులు వెళ్ల‌లేని ప్రాంతాల‌లో స‌మాన మోతాదులో శానిటైజ్ చేయ‌వ‌చ్చు.       

ఈ కార్యక్రమంలో ఆరోగ్య విభాగం అధికారి డా.ఆర్‌.ఆర్‌.రెడ్డి, క్యాటరింగ్ అధికారి శ్రీ శాస్త్రి, ఎవిఎస్వో శ్రీ గంగ‌రాజు, తదితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.