NADA NIRAJANAM VIBRATES TO BHAKTHI SANGEETHAM _ నాద‌నీరాజ‌నం వేదిక‌పై సాంస్కృతిక శోభ‌

Tirumala, 15 October 2018: The ongoing Navaratri Brahmotsavam at Tirumala has become a fountain head of cultural and performing arts presentation at its prestigious platforms of Nada Niranjanam and Asthana Mandapam.

On Day 6 of the Brahmotsavams cultural activities began at the Nada Niranjanam with the Mangaladwani by K Raviprabha and team in the early hours of Monday. The students and teachers of the Sri Venkateswara Pathashala, Dharmagiri presented the Chaturveda Parayanam.

Later on the team of S K Swarna Kumari & brundam, Tirupati rendered Vishnu sahasranamam.

In the afternoon the Usha and troupe from Hyderabad rendered the Anammayya Sankeertans followed by Anantha Krishna & brundam from Chennai presented the Nama sankeertan.

The feat of cultural programs at Brahmotsavam the Nada Niranjanam theater for the day climaxed with the harikatha by Y Venkateswarulu, Bhagavatar from SV Music college Tirupati.

At the Asthana Mandapam the Rashmi Madhusudhan & brundam from Bangalore presented the Bhakti Sangeet in the morning hours.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI


నాద‌నీరాజ‌నం వేదిక‌పై సాంస్కృతిక శోభ‌

అక్టోబ‌రు 15, తిరుమల 2018 ; శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా నాద‌నీరాజ‌నం వేదిక‌పై సోమవారం నిర్వ‌హించిన ఆధ్యాత్మిక‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద‌పాఠ‌శాల సంయుక్త‌ ఆధ్వర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.

ఇందులో భాగంగా నాదనీరాజనం వేదికపై ఉదయం శ్రీ కె.ర‌విప్ర‌భ‌, శ్రీ విఎం.సుబ్ర‌హ్మ‌ణ్యం బృందం మంగళధ్వని, తిరుమల ధర్మగిరి వేదపాఠశాల విద్యార్థులు చతుర్వేద పారాయణం నిర్వహించారు. అదేవిధంగా, తిరుపతికి చెందిన శ్రీమ‌తి ఎస్‌కె.స్వ‌ర్ణ‌కుమారి బృందం విష్ణుసహస్రనామ పారాయ‌ణం, విజ‌య‌వాడ‌కు చెందిన శ్రీ మ‌ల్లాప్ర‌గ‌డ శ్రీ‌మ‌న్నారాయ‌ణ ధార్మికోపన్యాసం చేశారు. సాయంత్రం అన్న‌మ‌య్య విన్న‌పాటు కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌ముఖ గాయ‌ని శ్రీ‌మ‌తి ఉష బృందం బ్ర‌హ్మ‌మొక్క‌టే ప‌ర‌బ్ర‌హ్మ‌మొక్క‌టే…., భావ‌ములోన బాహ్య‌మునందును…. త‌దిత‌ర కీర్త‌న‌ల‌ను వీనుల‌విందుగా గానం చేశారు. ఆ త‌రువాత చెన్నైకి చెందిన శ్రీ అయ‌కుడి అనంతకృష్ణ‌న్ బృందం నామ‌సంకీర్త‌నంలో ప‌లు సంకీర్త‌న‌ల‌ను ర‌స‌ర‌మ్యంగా గానం చేశారు. రాత్రి ఎస్వీ సంగీత క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ వై.వేంక‌టేశ్వ‌ర్లు హ‌రిక‌థా పారాయ‌ణం చేశారు.

అదేవిధంగా, తిరుమలలోని ఆస్థానమండపంలో సోమ‌వారం ఉదయం బెంగ‌ళూరుకు చెందిన శ్రీ‌మ‌తి ర‌ష్మి మ‌ధుసూద‌న్ బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.