BRAMHOTSAVAMS BHAKTI SANGEET THRILLS MUSIC LOVERS OF TIRUPATI _ తిరుప‌తిలో న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల సాంస్కృతిక శోభ

Tirupati, 15 October 2018 : The Temple Town of Tirupati reverberated with the cultural activities ,visually dance, bhakti music,staged by prominent artists from all over the country at the Navaratri Brahmotsavams on various platforms in Tirupati.

At Mahati auditorium Patri Satish & brundam from Chennai thrilled the Audience by Vadiya Sangeetham.

Smt RSS Saileswari and team from Tirupathi presented Bharata natyam at Annamacharya kala mandiram. Similarly at the Ramachandra Pushkarini,G Radha kumari and troupe from Vijayanagaram presented bhakti sangeet in the evening .


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTDs,TIRUPATI

తిరుప‌తిలో న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల సాంస్కృతిక శోభ

అక్టోబ‌రు 15, తిరుప‌తి 2018 శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో నిర్వహిస్తున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా సోమ‌వారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు చెన్నైకి చెందిన శ్రీ ప‌త్రి స‌తీష్ బృందం మృదంగం వాద్య సంగీత కార్య‌క్ర‌మం జ‌రిగింది.

అదేవిధంగా అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి ఆర్.ఎన్‌.ఎస్‌.శైలేశ్వ‌రి బృందం నృత్య ప్ర‌ద‌ర్శ‌న చేశారు. రామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు విజ‌య‌న‌గ‌రానికి చెందిన శ్రీ‌మ‌తి జి.రాధాకుమారి బృందం భ‌క్తి సంగీతం వినిపించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.