NARASIMHA JAYANTHI OBSERVED _ వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా శ్రీ నృసింహ పూజ‌

TIRUMALA, 14 MAY 2022: On the auspicious occasion of Narasimha Jayanti on Saturday in the holy Vaisakha month, a special Abhishekam was performed to Sri Yoga Narasimha Swamy located inside Tirumala temple complex.

 At Vasanta Mandapam 

In Vasanta Mandapam, Srivaru decked as Narasimha Swamy was seated on Simha Vahanam along with Sudarshana Chakrattalwar.

Vaikhanasa Agama Advisor Sri Mohana Rangacharyulu explained the significance of the festival.

Later Sri Nrisimha Mantram, Sri Nrisimha Astottaram and Sri Sudarshana Mantram were recited.

Temple DyEO Sri Ramesh Babu, Chief Priests Sri Venugopala Deekshitulu, Sri Krishna Seshachala Deekshitulu, Vedic scholars and devotees participated.

SVBC telecasted the programme live for the sake of world devotees.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా శ్రీ నృసింహ పూజ‌

తిరుమల, 2022, మే 14: వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ నృసింహ జ‌యంతిని పుర‌స్కరించుకుని తిరుమల‌ వసంత మండపంలో శనివారం శ్రీ నృసింహ పూజ శాస్త్రోక్తంగా జ‌రిగింది. మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల‌ వరకు జ‌రిగిన ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

ఇందుకోసం శ్రీవారిని నృసింహ స్వామి అలంకారంలో సింహ వాహ‌నంపై కొలువుదీర్చారు. సుద‌ర్శ‌న చ‌క్రం, నర‌సింహుని ప్ర‌తిమ‌ను ఏర్పాటుచేశారు. అభిముఖంగా శ్రీ న‌ర‌సింహ‌స్వామివారి ప్ర‌తిమ‌లను ఆశీనుల‌ను చేశారు.

ఈ పూజ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన టీటీడీ వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ ఎన్‌.వి.మోహ‌న‌రంగాచార్యులు మాట్లాడుతూ బాలుడైన భ‌క్త ప్ర‌హ్లాదుడు భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో భ‌గ‌వంతుని ప్రార్థించ‌గా నృసింహావ‌తారంలో శ్రీ‌మ‌హావిష్ణువు ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు తెలిపారు. చ‌తుర్ద‌శి రోజున సంధ్యా స‌మ‌యంలో న‌ర‌సింహుడు ఆవిర్భ‌వించి దుష్టసంహారం చేసిన‌ట్టు వివ‌రించారు. నృసింహ జ‌యంతి రోజున స్వామివారిని ప్రార్థిస్తే వ్యాధి బాధ‌లు తొల‌గుతాయ‌ని, క‌ష్టాలు దూర‌మ‌వుతాయ‌ని చెప్పారు.

పూజ‌లో భాగంగా శ్రీ నృసింహ మంత్రాన్ని 108 సార్లు, శ్రీ నృసింహ అష్టోత్త‌ర శ‌త‌నామావ‌ళి, శ్రీ సుద‌ర్శ‌న మంత్రాన్ని 24 సార్లు పారాయ‌ణం చేసినట్టు చెప్పారు.

శ్రీవారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, ప్ర‌ధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం పండితులు, అర్చ‌క‌స్వాములు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.