JEO OFFERS SILKS TO GANGAMMA _ శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు శ్రీవారి సారె

TIRUPATI, 14 MAY 2022: TTD JEO for Health and Education Smt Sada Bhargavi offered Pattu Sare to folk Goddess Gangamma in Tirupati on Saturday evening on behalf of TTD as a part of ongoing Jatara.

The sare procession commenced at Sri Govindaraja Swamy temple and she was welcomed by the Gangamma Gudi board authorities.

The tradition of presenting silks to Goddess Gangamma who is revered as sister of Venkateswara Swamy has been under vogue since several decades.

Local legislator Sri B Karunakar Reddy, Mayor Dr Sireesha, Deputy Mayors Sri Abhinay Reddy, Sri Narayana, Gangamma Gudi Chairman Sri Gopi Yadav, EO Sri Muni Krishna, DyEOs of local temples of TTD Sri Lokanatham, Sri Devendrababu, EE Sri Manoharam and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు శ్రీవారి సారె

తిరుపతి, 14 మే 2022: తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సారె పంపారు. శనివారం సాయంత్రం టిటిడి  జెఈవో శ్రీమతి సదా భార్గవి  శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీ గంగమ్మ గుడికి వెళ్ళి సారె అందజేశారు.

మే 10వ తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర మే 18వ తేదీ వరకు జరుగనున్న విషయం విదితమే.

తిరుప‌తి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సోదరిగా చెబుతారు. జాతర సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి గంగమ్మ తల్లికి సారె సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులోభాగంగా శనివారం తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అర్చకులు, అధికారులు శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి సారె తీసుకుని వచ్చారు. ఆలయంలోని శ్రీ పుండరీకవల్లి అమ్మవారి వద్ద పూజలు చేసిన అనంతరం జెఈవో శ్రీమతి సదా భార్గవి మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కళాబృందాల ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా శ్రీ గంగమ్మ ఆలయానికి సారె తీసుకుని వెళ్ళి ఆలయ అర్చకులకు అందజేశారు. అనంతరం ఆమె శ్రీ గంగమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు.

శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటి మేయర్లు శ్రీ భూమన అభినయ్ , శ్రీ ముద్ర నారాయణ, గంగమ్మ ఆలయ పాలకమండలి అధ్యక్షులు శ్రీ గోపియాదవ్, టీటీడీడిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం,శ్రీ దేవేంద్ర బాబు, ఈఈ శ్రీ మనోహర్ గంగమ్మ ఆలయ ఈవో శ్రీ మునికృష్ణ, టీటీడీ లోని పలు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.