NARASIMHA JAYANTI TO BE CELEBRATED IN TIRUMALA ON MAY 11 _ మే 11న తిరుమలలో శ్రీ నృసింహ జయంతి
Tirumala, 09 May 2025: Narasimha Jayanti will be observed in Tirumala on May 11, in the advent of the Swati Nakshatram in the month of Vaisakha.
On this occasion, a special abhishekam will be performed to the main idol of Sri Yoga Narasimha Swamy located in the first Prakaram of the Tirumala temple.
The sub-shrine of Sri Yoga Narasimha Swamy is located in the North-East corner of the main temple.
The deity will bless the devotees seated in a yogic posture, with four hands, the upper hands holding the conch and disc while the lower two represent meditative Posture.
The idol is believed to have been installed by the great Sri Vaishnava Saint Sri Ramanujacharya between 1330 and 1360 AD.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే 11న తిరుమలలో శ్రీ నృసింహ జయంతి
తిరుమల, 2025 మే 09: తిరుమల శ్రీవారి ఆలయంలో మే 11న నృసింహ జయంతి జరుగనుంది. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. శ్రీ యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం చేస్తారు.
ఆలయ ప్రాశస్త్యం :
శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆలయం ఉంది. శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. ఇక్కడ స్వామివారు యోగముద్రలో ఉంటారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతుల్లో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.