NARASIMHA MAHAYAGAM BEGINS AT AHOBILAM _ అహోబిల క్షేత్రంలో ఘనంగా ఘనంగా ప్రారంభమైన శ్రీ న‌ర‌సింహ మ‌హాయాగం

Tirupati, 1 Feb. 20: The three-day Narasimha Mahayagam conducted by Dasa Sahitya Project of TTD for the sake of world peace commenced at Ahobilam in Kurnool district on Saturday.

TTD is conducting the auspicious event since the last 14 years. As a past of the yagam nearly 300 women bhajan mandal members will perform Parayanam every day for four hours from 8am on wards and also later Narasimha Sankeertans penned by Purandara Dasa were also rendered. Earlier large number of Rutwiks performed Manya Sukta Parayanam.

Dasa Sahitya Project Special Officer Sri Anandathirthacharyulu supervised the arrangements and proceedings of the ritual.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

 

అహోబిల క్షేత్రంలో ఘనంగా ఘనంగా ప్రారంభమైన శ్రీ న‌ర‌సింహ మ‌హాయాగం

తిరుపతి, 2020 ఫిబ్రవరి 01: ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన అహోబిల క్షేత్రంలో టిటిడి దాస‌సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో  శ్రీ న‌ర‌సింహ మ‌హాయాగం శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.  ప్ర‌పంచ‌శాంతి కోసం, మాన‌వులకు భ‌యం, ఈతిబాధ‌లు తొల‌గించాల‌ని శ్రీ న‌ర‌సింహ‌స్వామివారిని ప్రార్థిస్తూ ఈ యాగం గత 14 సంవత్సరాలుగా టిటిడి నిర్వహిస్తున్నది. ఈ మ‌హాయాగం ఫిబ్రవరి 3వ తేదీ వరకు జ‌రుగ‌నుంది.      

ఇందులో భాగంగా ప్రతిరోజూ ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు యాగం నిర్వ‌హిస్తారు. ఈ సందర్భంగా దాదాపు 300 మంది మహిళా భ‌జ‌న మండ‌ళ్ల స‌భ్యులు న‌ర‌సింహ స్తుతి పారాయ‌ణం చేశారు. ఇందులో భాగంగా రుత్వికులు మ‌న్య‌సూక్త పారాయ‌ణం చేశారు. అనంతరం భ‌జ‌న మండ‌ళ్ల స‌భ్యులు పురందరదాసు రచించిన న‌ర‌సింహ కీర్త‌న‌లతో భ‌జ‌న‌లు, ధార్మిక ప్ర‌వ‌చ‌నాలు నిర్వ‌హిస్తారు.
   

ఈ కార్యక్రమంలో టిటిడి దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, ప్రముఖ రుత్వికులు, ఇత‌ర అధికారులు, భ‌జ‌న మండ‌ళ్ల స‌భ్యులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.