SAPTHAVAHANA SEVA AT GT _ సప్తవాహనాలపై భ‌క్తుల‌ను క‌టాక్షించిన శ్రీ గోవిందరాజస్వామి వారు

Tirupati, 01 Feb 20; The Radhasapthami festival witnessed a huge turn out of pilgrims at Sri Govindaraja Swamy temple on Saturday.

The vahanam fete commenced with Surya Prabha and concluded with Garuda Vahanam in this famous temple. While at 3am,  Sudarshana Chakrattalwar was rendered chakrasnanam at Alwar tank in Kapilatheertham. 

HH Sri Tirumala Chinna Jiyar Swamy, Special Grade DyEO Smt Varalakshmi and others participated. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

సప్తవాహనాలపై భ‌క్తుల‌ను క‌టాక్షించిన శ్రీ గోవిందరాజస్వామివారు

తిరుపతి, 2020 ఫిబ్ర‌వరి 01: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని  పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లు సప్తవాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించారు. శ‌నివారం తెల్లవారుజామున 3.00 గంటలకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహించారు. అనంతరం ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. వరుసగా సూర్యప్రభ, హంస, హనుమంత, పెద్దశేష, ముత్యపుపందిరి, సర్వభూపాల వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.00 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

 ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ్య‌ర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ శ‌ర్మ‌, శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణ‌మూర్తి, శ్రీ మునీంద్ర‌బాబు, ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఎ.పి.శ్రీ‌నివాస దీక్షితులు, ఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.