ANNUAL BTU ON SRI VB TEMPLE, NARAYANAVANAM FROM AUG 5_ ఆగస్టు 5 నుండి నారాయణవనంలోని శ్రీ వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మూెత్సవాలు

Tirupati,4 Aug. 19: The annual Brahmotsavams of TTD local temple Sri Veerabhadraswami temple of Narayanavanam will commence from August 5-13 with Ankurarpanam on August 5th morning.

It day Dwajarohanam will be held in the evening, followed by Chandraprabha vahanam. TTD plans to conduct vahanams on all the days of the Brahmotsavams at night and snapana Thirumanjanam in the morning.

The artists of cultural wings of HDPP and Annamacharya project will also perform bhajans, bhakti sangeet and kolatas during the Brahmotsavams.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగస్టు 5 నుండి నారాయణవనంలోని శ్రీ వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మూెత్సవాలు

తిరుపతి, 2019 ఆగస్టు 04: తిరుమల తిరుపతి దేవస్థానాలకు అనుబంధంగా ఉన్న నారాయణవనంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మూెత్సవాలు ఆగస్టు 5 నుండి 13వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.

ఆగస్టు 5వ తేదీ ఉదయం అంకురార్పణంతో బ్రహ్మూెత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు. బ్రహ్మూెత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 9.00 నుండి 10.30 గంటల వరకు స్నపనతిరుమంజనం, రాత్రి 7.00 నుండి 9.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.

ఇందులో భాగంగా ఆగస్టు 6వ తేదీ రాత్రి 7.00 నుండి 9.30 గంటల వరకు సింహవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 7న సాయంత్రం భూత వాహనం, ఆగస్టు 8న సాయంత్రం శేష వాహనం, ఆగస్టు 9న రాత్రి 7.00 గంటలకు అగ్నిగుండం ప్రవేశం అనంతరం పులి వాహనంపై స్వామివారు విహరిస్తారు. అదేవిధంగా ఆగస్టు 10న సాయంత్రం గజవాహనం, ఆగస్టు 11న మధ్యాహ్నం 3.00 గంటలకు రథోత్సవం అనంతరం రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. గ హస్త భక్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గ హస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, లడ్డూ వడ ప్రసాదాలను బహుమానంగా అందజేస్తారు.

ఆగస్టు 12న సాయంత్రం అశ్వవాహనం, ఆగస్టు 13న ఉదయం 10.00 గంటలకు వీరఖడ్గస్నానం, మధ్యాహ్నం 3.00 గంటలకు పల్లకీ ఉత్సవం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మూెత్సవాలు ముగియనున్నాయి.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో సాయంత్రం హరికథలు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.