AUGUST 13 AUCTION OF TTD LAND AT MADHAVARAM LAND LEASE / TENANCY_ ఆగస్టు 13వ తేదీ మాధవరం గ్రామము నందలి టిటిడి వ్యవసాయ భూమి కౌలు / లీజుకు వేలం

Tirupati, 4 Aug. 19: TTD plans to conduct the auction for lease/tenancy of its 11.94 acres of land at Madhavaram in Tadepalligudem Mandal of West Godavari district for the year 2019-2020 on August 13.

The auction documents could be purchased from the TTD Kalyana mandapam/information centre at Tadepalligudem or the office of DyEO (Revenue), TTD Administrative Building, Tirupati by submitting a DD for Rs.224/- drawn on Executive Officer, TTDs, Tirupati. The bids will be opened and auction held at 11 AM of August 13, 2019.

For more details contact TTD Kalyana mandapam at Tadepalligudem.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగస్టు 13వ తేదీ మాధవరం గ్రామము నందలి టిటిడి వ్యవసాయ భూమి కౌలు / లీజుకు వేలం

తిరుపతి, 2019 ఆగస్టు 04: పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లి గూడెం మండలము, మాధవరం గ్రామములోని తిరుమల తిరుపతి దేవస్థానములకు చెందిన 11.94 ఎకరాల వ్యవసాయ భూమిని జూలై 2019 – 2020 సంవత్సరానికి గాను కౌలు / లీజుకు ఇవ్వడానికి వేలం వేయనున్నారు. ఈ భూములను కౌలుకు తీసుకునేందుకు ఆసక్తియున్న వారి నుండి సీల్డు టెండర్లు ఆహ్వానించడమైనది. తాడేపల్లి గూడెంలోని టిటిడి కల్యాణమండపము / సమాచార కేంద్రము నందు వ్యవసాయ భూములను ఆగస్టు 13వ తేదీ ఉ. 11 గంటలకు టెండర్‌ సహిత వేలం పాట వేయబడును.

టెండరు ధరఖాస్తులు కావలసిన వారు కార్యనిర్వహణాధికారి, టిటిడి, తిరుపతి పేరిట రూ.224/- డిడిని తీసుకోవాలి. వేలము పాట ప్రారంభించే ముందు వరకు డిడిలను సమర్పించి సహాయ కార్యనిర్వహణాధికారి (రెవెన్యూ), టిటిడి పరిపాలన భవనము, తిరుపతి వద్ద లేదా తాడేపల్లి గూడెంలోని టిటిడి కల్యాణమండపము / సమాచార కేంద్రము, మేనేజరు నుండి ధరఖాస్తులు పొందవచ్చు. వ్యవసాయ భూమి విస్తీర్ణం బట్టీ టిటిడి నిర్ణయించిన ఇ.ఎం.డి కొరకు ఆయా డిడిలను జత చేయాలి. నింపబడిన సీల్డు టెండరు ఫారములు వేలము పాట ప్రారంభించే ముందు వరకు స్వీకరించబడును.

ఇతర వివరాలకు తాడేపల్లి గూడెంలోని టిటిడి కల్యాణమండపము / సమాచార కేంద్రము నందు సంప్రదించవలెను.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.