NARAYANAVANAM BTU POSTERS RELEASED _ నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

TIRUPATI, 06 MAY 2022: The annual Brahmotsavam of Narayanavanam was released on Friday by TTD JEO Sri Veerabrahmam.

The Kalyana Venkateswara annual fete will take place between May 13 and 21.

The JEO released posters, pamphlets at his chambers in TTD Administrative Building.

DyEO Smt Nagaratna,  AEO Sri Durgaraju and others were present. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

తిరుపతి, 2022 మే 06: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, క‌ర‌ప‌త్రాల‌ను టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం ఆవిష్కరించారు. టిటిడి పరిపాలనా భవనంలోగల జెఈవో కార్యాలయంలో శుక్ర‌వారం ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ మే 13 నుండి 21వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయని తెలిపారు. మే 8న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, మే 12న అంకురార్పణం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

13-05-2022 ధ్వజారోహణం పెద్దశేష వాహనం

14-05-2022 చిన్నశేష వాహనం హంస వాహనం

15-05-2022 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

16-05-2022 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

17-05-2022 మోహినీ అవతారం గరుడ వాహనం

18-05-2022 హనుమంత వాహనం గజ వాహనం

19-05-2022 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

20-05-2022 రథోత్సవం కల్యాణోత్సవం, అశ్వవాహనం

21-05-2022 చక్రస్నానం ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 20వ తేదీ రాత్రి 7.30 నుండి 9 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రూ.1000/- చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక వడ, కుంకుమ బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమ‌తి నాగ‌ర‌త్న‌, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, సూప‌రింటెండెంట్ శ్రీ ఏకాంబ‌రం, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ నాగ‌రాజు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.