NAVAGRAHA HOMAM HELD AT SRI KT _ శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా నవగ్రహ హోమం

Tirupati 21 Nov. 20: As part of month long Karthika Homa Mahotsavams at Sri Kapileswara Swamy temple, Navagraha Homam was held on Saturday.

Series of rituals including Navagraha Homam, Purnahuti, Kalasa Udwasana, Maha Shanti Abhishekam, Navagraha Kalasabhishekam were held between 9 am and 12 noon in the temple.

While in the evening Kalasa Sthapana for Kalabhairava Homam will be readied by the priests as Sri Kalabhairava Swamy Homam is scheduled to take place on Sunday, November 22.

Temple DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupati and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా నవగ్రహ హోమం

తిరుపతి, 2020 న‌వంబ‌రు 21: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ‌నివారం నవగ్రహ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా ప్ర‌త్యేక కార్య‌మాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి 12 గంటల వరకు నవగ్రహహోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, నవగ్రహ కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ కాల‌భైర‌వ‌ స్వామివారి కలశస్థాపన, విశేష దీపారాధన చేపట్టనున్నారు.

న‌వంబ‌రు 22న‌ శ్రీ కాల‌భైర‌వ‌ స్వామివారి హోమం

న‌వంబ‌రు 22వ తేదీ ఆది‌వారం శ్రీ కాల‌భైర‌వ‌ స్వామివారి హోమం జ‌రుగ‌నుంది.
         
ఈ కార్యక్రమంలో ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

క‌పిల‌తీర్థం, ధ్యానారామంలో కార్తీక మాస పూజ‌లు

కార్తీక మాసం సంద‌ర్బంగా టిటిడి ఆధ్వ‌ర్యంలో క‌పిలేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య ప్రాంగ‌ణంలో  శ‌నివారం ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శాక స‌ప్త‌మి – స‌ప్త విప్ర భోజ‌న వ్ర‌తం (శాకంబ‌రీ వ్ర‌తం) నిర్వ‌హించారు.

ప్ర‌ముఖ పండితులు, జాతీయ సంస్కృత విశ్వ విద్యాల‌యం ఆచార్యులు రాణి స‌దాశివ‌మూర్తి శాక స‌ప్త‌మి – స‌ప్త విప్ర భోజ‌న వ్ర‌తం విశిష్టత గురించి వివ‌రించారు.

ధ్యానా‌రామంలో …

కార్తీక మాసం సంద‌ర్భంగా అలిపిరి స‌మీపంలోని ధ్యానారామంలో  ఉద‌యం 6.00 నుండి 6.45 గంట‌ల వ‌ర‌కు వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, విద్యార్థుల‌చే మ‌హాశివుడికి రుద్రాభిషేకం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా న‌మ‌కం, చ‌మ‌కం, మ‌హాహ‌ర‌తి జ‌రిగాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.