NAVAGRAHA HOMAM HELD _ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా న‌వ‌గ్ర‌హ హోమం

Tirupati, 21 November 2023: As a part of month-long Karthika masa Homa Mahnotsavams, Navagraha Homam was observed on Tuesday in Sri Kapileswara Swamy temple at Tirupati.

In the morning Navagraha Homam, Purnahuti, Kalasa Udhwasana, Mahashanti Abhishekam, Navagraha Kalasabhishekam were performed.

In the evening Sri Kamakshi Kalasa Sthapana, Visesha Deeparadhana will be observed.

From November 22 to 30 Chandi Homam will be performed.

DyEO Sri Devendra Babu, AEO Sri Subba Raju, Temple Inspector Sri Balakrishna, temple priests were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా న‌వ‌గ్ర‌హ హోమం

తిరుపతి, 2023 న‌వంబ‌రు 21: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం న‌వ‌గ్ర‌హ హోమం శాస్త్రోక్తంగా జ‌రిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మ‌హోత్స‌వాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం నవగ్రహహోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, నవగ్రహ కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మ‌వారి కలశస్థాపన, విశేష దీపారాధన చేపట్టనున్నారు.

హోమ మ‌హోత్స‌వాల్లో భాగంగా న‌వంబ‌రు 22 నుండి 30వ తేదీ వ‌ర‌కు శ్రీ కామాక్షి అమ్మ‌వారి హోమం(చండీ యాగం) జ‌రుగ‌నుంది.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఏఈవో శ్రీ సుబ్బ‌రాజు, సూప‌రింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాల‌కృష్ణ‌, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.