NAVARATNA VAIDYA SAMMELANAM CASTS MAGIC IN MAHATI _ భక్తిభావాన్ని పంచుతున్న శివరాత్రి సంగీత మహోత్సవాలు

MUSIC LOVERS OF TIRUPATI IMMERSE IN “BHAKTI SANKEERTANA SAGARA”

 TIRUPATI, 01 MARCH 2022: The unique classical Carnatic instrumental jugalbandi, “Navarathna Vaidya Sammelanam” organised at Mahati, casted a spell over the denizens of Tirupati with its mellifluous notes.

Speaking on the occasion, the Principal of Sri Venkateswara College of Music and Dance, Sri Tirupati M Sudhakar said, this unique college dedicated for fine arts with an aim to promote the classical Indian Carnatic Music was set up in the year 1963 by TTD.

It the last 60 years, the college produced stalwarts and versatile artists to the field of Carnatic vocal, instrumental music world, he added.

He said, the “Navarathna Vaidya Sammelanam” is a unique programme where in artists representing expertise in various instruments present the concert.

It was a treat for the music lovers on Monday evening, as they were immersed in the melodious tunes and notes produced by the wind and string instruments.

On Mridangam, Principal Sri Sudhakar, Veena Smt S Sri Vani, Violin Dr KV Krishna, Flute Sri M Ananta Krishna, Nadaswaram Sri V Haribabu, Dolu Sri Y L Srinivasulu, Ghatam Sri AS Shankar, Kanjeera Sri TV Krishna Vamsi,

Talam Sri Naveen presented their talents and mesmerized the audience.

Starting with Amma Aanandadayini…composed by renowned Carnatic Music legend, late Dr M Balamurali Krishna in Gambhira Nata Ragam, the nine precious musical icons presented Tyagaraja Kritis which included the popular “Endaro Mahanubhavulu…” in Sri Ragam, “Nada Loludai…Brahmandamu Kanave Manasa” in Kalyana Vasantam followed by a jugalbandi of five Ragas which stood as a special attraction.

The entire auditorium reverberated with divine musical vibes generated out of the magical performance by the artists to rhythmic applause from the art lovers of the temple city.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

భక్తిభావాన్ని పంచుతున్న శివరాత్రి సంగీత మహోత్సవాలు

ఆకట్టుకున్న నవ వాద్య సమ్మేళనం – పంచాక్షరి

తిరుపతి, 2022 మార్చి 01: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల మ‌రియు ఎస్వీ నాద‌స్వ‌ర‌, డోలు పాఠ‌శాల ఆధ్వర్యంలో తిరుప‌తిలోని మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న శివరాత్రి సంగీత మహోత్సవాలు మంగళవారం కొనసాగాయి.

ఇందులో భాగంగా సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు నిర్వహించిన నవ వాద్య సమ్మేళనం – పంచాక్షరి కార్యక్రమం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సుధాకర్ మాట్లాడుతూ వీణ, వేణువు, మృదంగం, నాదస్వరం, డోలు, ఘటం, వయోలిన్, మోర్సింగ్, కంజీర వాయిద్యాలతో కలిపి నిర్వహించే కార్యక్రమాన్ని నవ వాద్య సమ్మేళనం అంటారని తెలిపారు. ఈ వాయిద్యాలతో కళాకారులు శృతిలో, లయలో లీనమై వాయిస్తూ తాము పొందిన అనుభూతిని, ఆనందాన్ని ప్రేక్షకులకు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. మహా శివరాత్రి పర్వదినం నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం అన్నారు. పరమాత్ముని పంచ ముఖాల నుండి ఐదు స్వరాలు ఉద్భవించాయని, వీటిని పంచాక్షరి అని పిలుస్తారని తెలిపారు. వీటితో పాటు అమ్మవారి ముఖం నుంచి రెండు స్వరాలు పుట్టాయన్నారు. ఈ విధంగా ఉద్భవించిన సప్తస్వరాల నుంచి అనంత కోటి రాగాలు పుట్టాయని తెలియజేశారు. వీటిలో కొన్ని రాగాలతో ఈరోజు సంగీత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కాగా‌, ఉదయం మొద‌ట‌గా ఎస్వీ నాద‌స్వ‌రం డోలు పాఠ‌శాల విద్యార్థులు  మంగ‌ళ‌క‌రంగా నాద‌స్వ‌రం, డోలు వాయిద్య‌సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఆ త‌రువాత భ‌క్తిగీతాల‌ బృంద‌గానం, వాద్యసంగీతం, వయోలిన్ డ్యూయెట్, మృదంగ లయ విన్యాసం చేప‌ట్టారు.

సాయంత్రం నాద‌స్వ‌రం – డోలు వాద్య సంగీతం, కూచిపూడి, భరతనాట్య ప్రదర్శన ఆక‌ట్టున్నాయి.

ఈ కార్య‌క్ర‌మంలో అన్ని విభాగాల అధ్యాప‌కులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.