NAVARATRI UTSAVAMS FROM SEPTEMBER 26 TO OCTOBER 5 _ సెప్టెంబరు 26 నుంచి అక్టోబ‌రు 5వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

TIRUPATI, 11 SEPTEMBER 2022: The Navaratri Utsavams in Tiruchanoor temple are scheduled between September 26 to October 5.

 

Every year these utsavams are being observed in a big manner with Snapana Tirumanjanam rendered to the utsava deity of Sri Padmavathi Ammavaru every day.

 

On September 30, Lakshmi Puja and October 5, Astottara Satakalashabhisekam will be performed.

TTD has cancelled Arjita Sevas including Kalyanotsavam, Sahasra Deepalankara Seva during these ten days.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబరు 26 నుంచి అక్టోబ‌రు 5వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

తిరుపతి, 2022 సెప్టెంబరు 11: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 26 నుంచి అక్టోబ‌రు 5వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి.

ఈ సందర్భంగా ప్రతిరోజూ ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అదేవిధంగా సాయంత్రం ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. అక్టోబరు 5వ తేదీ విజయదశమినాడు శ్రీపద్మావతి అమ్మవారు విశేషమైన గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

న‌వ‌రాత్రి ఉత్స‌వాల కార‌ణంగా ఈ 10 రోజుల పాటు క‌ల్యాణోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవల‌ను ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది. అదేవిధంగా, సెప్టెంబ‌రు 30న ల‌క్ష్మీపూజ‌, అక్టోబరు 5న అష్టోత్త‌ర శ‌త క‌లశాభిషేకం సేవ‌లు రద్ద‌య్యాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.