GOLD PADUKAS DONATED _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి స్వ‌ర్ణ పాదాలు విరాళం

TIRUPATI, 11 SEPTEMBER 2022:Hyderabad based devotee Sri Satya Narayana has donated a pair of padukas to Sri Padmavathi Ammavaru in Tiruchanoor temple on Sunday.

 

The donation weighed around 85 grams and costs ₹.4.00 lakhs.

 

AEO Sri Prabhakar reddy, Superintendent Sri Seshagiri and archaka Babu Swamy were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి స్వ‌ర్ణ పాదాలు విరాళం

తిరుపతి, 2022 సెప్టెంబరు 11: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి ఆదివారం హైద‌రాబాద్‌కు చెందిన భ‌క్తుడు శ్రీ స‌త్య‌నారాయ‌ణ స్వ‌ర్ణ పాదాలు విరాళంగా స‌మ‌ర్పించారు.

ఆల‌యంలో జ‌రిగే క‌ల్యాణోత్స‌వంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తికి అలంక‌రించేందుకు ఈ పాదాల‌ను అందించారు. 85 గ్రాముల బ‌రువుగ‌ల ఈ పాదాల విలువ రూ.4 ల‌క్ష‌లు అని భ‌క్తుడు తెలిపారు. ఈ స్వ‌ర్ణ‌పాదాల‌ను ఆల‌యంలో ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ శేష‌గిరికి భ‌క్తుడు అంద‌జేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.