NEW JEO TAKES CHARGE _ నూత‌న జెఈవోగా శ్రీ వి.వీరబ్రహ్మయ్య బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

TIRUMALA, 25 SEPTEMBER 2021: Sri V Veerabrahmaiah took charge as Tirupati Joint Executive Officer of Tirumala Tirupati Devasthanams at Ranganayakula Mandapam in Tirumala on Saturday.

After darshan of Sri Venkateswara Swamy, speaking on the occasion he said it is a divine opportunity for him to serve in an organization like TTD which administers the affairs of the world-famous shrine of Sri Venkateswara Swamy. “I prayed Srivaru to give me strength to execute my duties as per the rules and regulations of TTD”, he added.

He also thanked TTD Chairman Sri YV Subba Reddy and EO Dr KS Jawahar Reddy.

He was presented Theertha Prasadams, Laminated photo of Srivaru and Coffee Table book on TTD by temple Deputy EOs Sri Ramesh Babu.

DyEOs Sri Harindranath, Sri Lokanatham, Smt Sudharani, VGO Sri Bali Reddy and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నూత‌న జెఈవోగా శ్రీ వి.వీరబ్రహ్మయ్య బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

తిరుమల, 2021 సెప్టెంబ‌రు 25: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల నూత‌న తిరుప‌తి జెఈవోగా శ్రీ వి.వీరబ్రహ్మయ్య శనివారం ఉద‌యం శ్రీ‌వారి ఆల‌యంలోని రంగనాయకుల మండపంలో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ద‌ర్శ‌నానంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌పంలో వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ రమేష్ బాబు స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్ ను నూతన జెఈఓకు అంద‌జేశారు.

ఈ సందర్భంగా శ్రీ వి.వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్వహణ చేస్తున్న టిటిడి లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో సేవ చేయడం గొప్ప అవకాశమన్నారు. టిటిడి నియమ నిబంధనల మేరకు తనకు విధులు నిర్వహించే శక్తిని ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా టిటిడి బోర్డు ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి డెప్యూటీ ఈవోలు శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, శ్రీ లోకనాథం, శ్రీ‌మ‌తి సుధారాణి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.