NEW LUGGAGE SCANNER COMES UP AT ALIPIRI _ అలిపిరిలో నూతన లగేజి స్కానింగ్‌ యంత్రం ప్రారంభం

TIRUPATI, JAN 19:  The TTD Vigilance and Security department has come up with an advanced luggage scanner at Alipiri which was formally inaugurated by TTD Cheif Vigilance and Security Officer Sri GVG Ashok Kumar on Saturday.

This new luggage scanner will thoroughly check even the unlocked baggage and later will be despatched to Tirumala.

Tirupati VGO Sri Hanumanthu, AVSO Sri Jawaharlal and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అలిపిరిలో నూతన లగేజి స్కానింగ్‌ యంత్రం ప్రారంభం

తిరుపతి, జనవరి 19, 2013: తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వెళ్లే భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని అలిపిరి వద్ద గల లగేజి కేంద్రంలో లగేజి స్కానింగ్‌ యంత్రాన్ని తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ శనివారం ఉదయం ప్రారంభించారు.
 
ఇదివరకు శ్రీనివాసం, విష్ణునివాసం, అలిపిరి లగేజి కేంద్రాల్లో తాళాలు గల లగేజి బ్యాగులను మాత్రమే తీసుకుని పరిశీలించి తిరుమలకు తరలించేవారు. తాళాలు లేని లగేజి బ్యాగులను తిరస్కరించేవారు. ఈ క్రమంలో భక్తుల ఇబ్బందులను గుర్తించిన తితిదే యాజమాన్యం రూ.3 లక్షల వ్యయంతో సరికొత్త లగేజి స్కానింగ్‌ యంత్రాన్ని కొనుగోలు చేసింది. ఈ యంత్రం తాళాలు లేని లగేజి బ్యాగులను కక్షుణ్ణంగా పరిశీలించి దారంతో కట్టేస్తుంది. అనంతరం లగేజి బ్యాగులను తిరుమలకు తరలిస్తారు.
ఈ కార్యక్రమంలో విజిఓ శ్రీ హనుమంతు, ఏవిఎస్‌ఓ శ్రీ జవహర్‌లాల్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.