LORD VENKATESWARA TO BLESS DEVOTEES AT KUMBHMELA FROM JAN 27 _ జనవరి 26 నుండి అలహాబాదు కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం

TIRUPATI, JAN 19:  The temple administration of Tirumala Tirupati Devasthanams is all set to take part in the world’s biggest religious congregation – Maha Kumbh mela at Allahabad in Uttar Pradesh from January 27.
 
In this connection, TTD EO Sri LV Subramanyam held a high level review meeting with the TTD officials in Sri Padmavathi Guest House in Tirupati on Saturday. He called upon the officials to make use of the rarest and greatest opportunity to take the glory of the country’s largest Hindu Religious institution which administers the world famous temple of Lord Venkateswara to further heights.
 
“Whatever pujas and arjitha sevas we perform in the temple of Tirumala will be performed every day in the replica temple which would be set up in Sector VI at Kumbh mela starting from Jan 27 till March 13. All these programmes will be aired live on SVBC. Besides we should also give vigorous publicity to TTD publications, audio and video CDs.
We should not compromise on our arrangements”, he told the heads of respective departments.
 
APPEAL TO SRIVARI SEVAKS:
 
TTD EO gave a clarion call to the Srivari Seva volunteers who are spread across the country to take part in Kumbhmela to offer free services to the multitude of visiting pilgrims in Allahabad.
 
“I appeal to the Srivari Sevaks especially those who are residing in UP , Jharkhand and Chattisgarh to voluntarily take part in Kumbhmela to render free services to the pilgrims”, he maintained.
 
Meanwhile TTD Tirupati JEO Sri P.Venkatarami Reddy, CE Sri Chandrasekhar Reddy, SE Sri Ramachandra Reddy, Transport GM Sri Sesha Reddy and other officials took part.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జనవరి 26 నుండి అలహాబాదు కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం

తిరుపతి, జనవరి 19, 2013: ఆధ్యాత్మిక ప్రపంచంలోనే అతిపెద్ద భక్తజన సమ్మేళనంగా శ్లాఘించబడుతున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఆలహాబాదు క్షేత్రంలో నిర్వహిస్తున్న కుంభమేళాలో జనవరి 26వ తేదీ నుండి తితిదే శ్రీవారి నమూనా ఆలయాన్ని ప్రారంభించి భక్తులను భక్తిపారవశ్యంలో రంజింపచేయనుంది.
 
ఈ మేరకు కుంభమేళాలో తితిదే చేయవలసిన ఏర్పాట్లపై తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం శనివారం నాడు తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర త్రివేణి పుణ్యస్నానం సర్వపాపహరణమన్నారు. అటువంటి సర్వోత్తమమైన పుణ్యక్షేత్రంలో తితిదే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి భక్తులకు ద్విగుణీకృతమైన ఆనందాన్ని కల్పించడంలో ఏమాత్రం రాజీ పడకూడదని ఆయన అధికారులకు సూచించారు. కాగా జనవరి 21వ తారీఖున తిరుమలలోని వైభవోత్సవ మండపం చెంత కుంభమేళా ర్యాలీ నిర్వహించనున్నట్టు  తెలిపారు. అలాగే జనవరి 24వ తేదీన అలహాబాదు నగరం నుండి కుంభమేళా ప్రాంగణం వరకు తితిదే భక్తులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
 
తితిదే ఏర్పాట్లలో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలను, ప్రత్యేక పూజలను కూడా ఈ ఆలయంలో నిర్వహించాలని ఆయన ఆదేశించారు. అదేరీతిలో కోట్లాది మంది భారతీయులకు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందించేందుకు వీలుగా తితిదే ఆధ్వర్యంలో పుస్తకప్రదర్శనశాలలను, ఆడియో మరియు వీడియో సీడీలను విక్రయించాలని ఆయన సూచించారు. తితిదే నమూనా ఆలయం, ప్రదర్శనలను కుంభమేళాలోని సెక్టారు-6లో ఏర్పాటు చేయనున్నట్టు ఈవో తెలిపారు. కాగా, తితిదే కుంభమేళాలో చేపడుతున్న పూజాది కార్యక్రమాలను ఎస్వీ భక్తి చానల్‌లో ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం కూడా చేయాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, ఎస్‌ఈ శ్రీ రామచంద్రారెడ్డి, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ప్రత్యేకాధికారి శ్రీ రఘునాథ్‌, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్‌ మేడసాని మోహన్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఉత్తరప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లోని శ్రీవారి సేవకులు భక్తులకు స్వచ్ఛందంగా సేవలందించండి – ఈఓ పిలుపు

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా విచ్చేసే భక్తులకు స్వచ్ఛంద సేవలందించడమే పరమావధిగా దేశం నలుమూలల నుండి విచ్చేస్తున్న శ్రీవారి సేవకులు అదేరీతిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా అలహాబాదులో నిర్వహించబడుతున్న కుంభమేళాలో పాల్గొని భక్తులకు ఉచిత సేవలు అందించాలని శ్రీవారి సేవకులకు తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం పిలుపునిచ్చారు.
ఉత్తరప్రదేశ్‌ పరిసర రాష్ట్రాలైన జార్ఖండ్‌, ఛత్తీస్‌ఘడ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల నుండి శ్రీవారి సేవకు విచ్చేసే భక్తులు స్వచ్ఛందంగా కుంభమేళాలో పాల్గొని అక్కడ కూడా భక్తులకు ఉచిత సేవలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.