NO CHANGE IN SENIOR CITIZEN DARSHAN – TTD _ వయోవృద్ధుల దర్శనం పై పుకార్లను నమ్మవద్దని భక్తులకు టీటీడీ మరో మారు విజ్ఞప్తి
Tirumala, 04 August 2024: Appealing once again to pilgrims TTD reiterated not to believe on the fake and misleading news spread on a few social media platforms regarding the darshan for elderly and handicapped people.
TTD is releasing online quota for 1000 senior citizens and disabled people every month on 23rd at 3 pm three months in advance. The Ticket holder will get a Laddu worth Rs.50/- free.
They will be allowed for Darshan, adjacent to the Tirumala Nambi Temple in Tirumala, through the Senior Citizen/PHC line at 3 PM every day.
TTD appeals to devotees only to visit www.tirumala.org, https://ttdevastanams.ap.in for correct information.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వయోవృద్ధుల దర్శనం పై పుకార్లను నమ్మవద్దని భక్తులకు టీటీడీ మరో మారు విజ్ఞప్తి
తిరుమల, 04 ఆగస్టు 2024: వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇవి పూర్తిగా అవాస్తవం.
వాస్తవం ఏమిటంటే, ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టిటిడి ప్రతి నెల 23 మధ్యాహ్నం 3 గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది.
టికెట్ పొందిన వ్యక్తికి రూ.50/- ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుంది.
తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్‌సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
కావున సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు మరోమారు విజ్ఞప్తి చేస్తున్నది. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించగలరు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే త్రికా ప్రకటన