NO MISDENEANOUR HAPPENED IN TIRUMALA _ తిరుమలలో ఎటువంటి అపచారం జరగలేదు

DON’T BELIEVE RUMOURS – TTD

Tirumala, 04 October 2024: On the occasion of the annual Brahmotsavam in Tirumala, on the first day of the ceremonial Garuda flag hoisting, there are widespread rumours by a section of media and on social media platforms that the Hook used to hoist the Garuda flag on the flag pole broke which is a sign of misdemeanour.

TTD appealed to devotees not to believe such baseless rumours.

It is customary to check every single carrier before Brahmotsavam.  And if any object is found unfit, it is immediately removed and replaced them with new ones.

As part of that, the priests have removed the old Kokki and replaced it with a new one. 

But it is unfortunate that some media have propagated that as a bad sign even before the commencement of annual festival.

TTD once again appeals to its devotees not to believe such rumours.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో ఎటువంటి అపచారం జరగలేదు

వదంతులను నమ్మకండి-టీటీడీ

తిరుమల, 04 అక్టోబరు 2024:: తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిరోజైన ధ్వజారోహణం నాడు, ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిపోయిందని, ఇది అపచారమని కొన్ని ప్రసార మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వదంతులు వస్తున్నాయి.

శ్రీవారి భక్తులు ఇటువంటి వదంతులు నమ్మవద్దని కోరడమైనది .

సాధారణంగా బ్రహ్మోత్సవాల మునుపే ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేసుకోవడం ఆనవాయితీ. ఏవైనా భిన్నమైన వస్తువులు ఉంటే వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చడం సంప్రదాయం.

అందులో భాగంగానే భిన్నమైన ద్వజపటం తాలూకు కొక్కిని అర్చకులు తొలగించి దాని స్థానంలో కొత్త దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతలో దీనిని అపచారం జరిగినట్లుగా కొన్ని ప్రచార మధ్యమాలు ప్రసారం చేయడం దురదృష్టకరం.

తిరుమలలో ఎటువంటి అపచారం జరగలేదని, భక్తులు ఇటువంటి వదంతులు నమ్మవద్దని టీటీడీ మరొకసారి తెలియజేస్తున్నది.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయబడింది