NON STOP ANNAMAIAH SANKEERTAN AKANDA MAHA YAJNAM BEGINS _ అన్న‌మాచార్య క‌ళామందిరంలో ”అన్నమయ్య సంకీర్తనల‌ అఖండ మ‌హాయ‌జ్ఞం” ప్రారంభం

Tirupati, 24 Feb. 20: The Annamaiah sankeertans Akhanda Maha Yajnam of 24 hours non stop singing of Annamacharya sankeertans organised by the TTD to highlight the significance of Bhakti culture began ceremoniously at the Annamacharya Kala mandir on Monday evening.

Earlier Annamaiah utsava idol will be taken in a procession on Monday afternoon with artists singing Annamacharya sankeertans and mangala vadyams all the way from TTD administrative building to Kala mandir.

Thereafter the non stop Annamaiah sankeertans will be sung by devotees and artists from Monday evening to till Tuesday night 9.00 pm.

Director of TTDs Annamacharya Project Acharya Bhamidipati Vishwanath, eminent scholar Dr Samudrala Lakshmiah, and artists of Annamacharya project from all regions participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI     

 

 

అన్న‌మాచార్య క‌ళామందిరంలో ”అన్నమయ్య  సంకీర్తనల‌ అఖండ మ‌హాయ‌జ్ఞం” ప్రారంభం

ఫిబ్రవరి 24, తిరుప‌తి, 2020: తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో అన్నమయ్య  సంకీర్తనల‌ అఖండ మ‌హాయ‌జ్ఞం కార్య‌క్ర‌మం సోమ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది.

ముందుగా మ‌ధ్యాహ్నం 4 గంట‌ల‌కు టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో అన్న‌మ‌య్య ఉత్స‌వ విగ్ర‌హానికి పూజ‌లు నిర్వ‌హించారు. అక్క‌డినుండి అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు సంకీర్తనలు ఆలపిస్తూ మేళ‌తాళాల మ‌ధ్య ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయ మాడ వీధుల గుండా అన్నమాచార్య కళామందిరానికి చేరుకున్నారు. సాయంత్రం 6 గంటలకు అన్నమయ్య  సంకీర్తనల‌ అఖండ మ‌హాయ‌జ్ఞం ప్రారంభ‌మైంది. మంగ‌ళ‌వారం సాయంత్రం వ‌ర‌కు 24 గంట‌ల పాటు నిరంతరాయంగా క‌ళాకారులు సంకీర్తనలను ఆలపిస్తారు. రాత్రి 9 గంట‌ల‌కు ముగింపు కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య భ‌మిడిపాటి విశ్వ‌నాథ్, ప్ర‌ముఖ పండితుడు డా. స‌ముద్రాల ల‌క్ష్మ‌ణ‌య్య‌, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.