NON-STOP RAINS ENHANCES THE BEAUTY OF TIRUMALA _ శేషగిరులే హిమాద్రిగా  మారినవేళ … భ‌క్తుల‌కు మ‌రింత ఆధ్యాత్మిక ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం 

DEVOTEES CAPTURE NATURE’S MAGICAL MOMENTS ON THEIR MOBILES

ALL DAMS FULL TO THEIR CAPACITIES

TIRUMALA, 11 DECEMBER 2022: The beauty of Tirumala enhanced with the advent of fog, mist, torrents and waterfalls everywhere all along the First and Second Ghat Roads besides the interiors of Seshachala ranges etc. due to the continuous rains in the Hill Town from the past two days.

Throughout the 15km long Second Ghat road, streams of water were seen emerging from the hilly rocks, which enhanced the glamour quotient of Tirumala hills. It’s been a rare spectacle for the passersby as wat5er streams on second ghat road occurs only there is an unprecedented downpour. 

The pilgrim devotees especially the pedestrian pilgrims who trek the footpath routes, seen enjoying every moment, capturing the beauties of nature in their cell phones, cameras etc. All the vehicles which usually rush to reach Tirumala to have darshan of Lord, chose to travel at a slow pace to enjoy “Never Seen Before”, beauties of Seshachala Ranges.

The streams gushing out at Akkagarla Gudi, 38, 37, 26, 21 turns in the Down Ghat Roads provided a feast to the devotees. 

On the other hand, the fog and mist wrapped up the entire Ghat road and various places in Tirumala, providing a different look to visiting pilgrims who cherished the rare moments. 

Apart from Malavadi Gundem and Kapila Teertham waterfalls, several others are also seen emerging from the rocky structures of the Seshachala Ranges. The Check dams are also seen overflowing in down ghat road.

Meanwhile, Tirumala registered nearly 210mm of rainfall following the effect of the Mandous Cyclone. All the five dams, viz. Gogarbham, Papavinasanam, Akasaganga, Kumaradhara and Pasupudhara are full to their capacities.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శేషగిరులే హిమాద్రిగా  మారినవేళ … భ‌క్తుల‌కు మ‌రింత ఆధ్యాత్మిక ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం 
 
తిరుమల, 2022 డిసెంబర్ 11: తెల్లని పొగమంచు తెరల నడుమ, చలచల్లని మలయ వీచికలు గిలిగింతలు పెడుతుంటే తిరుమలకు ఇచ్చేసే అసంఖ్యాక‌ భక్తులకు క్రొంగొత్త అనుభూతిని కల్గిస్తూ శేషగిరులలోనే హిమగిరులను కూడా దర్శించుకొనే మధురానుభూతిని ప్రకృతీమాత కల్పిస్తున్నది.
 
గత రెండురోజులుగా తిరుమలలో కురుస్తున్న వర్షాలకు శేషగిరులలో వెలసివున్న అనేకానేక పుణ్యతీర్థాలు, జలపాతాలు జలకళతో ఉట్టిపడుతూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎత్తైన కొండచరియల నుండి ఎగసిఎగసి పడుతున్న ఈ జలపాతాలను తిలకించడానికి భక్తులు ఎంతో ఉత్సుకతను ప్రదర్శిస్తున్నారు.
 
తిరుమలలోని వృక్షసంపద, వివిధ వర్ణాలతో కూడిన పుష్పాలు, అరుదైన ఔషధీమొక్కలు మొదలైనవి వర్షపు బిందువులకు సరికొత్త హంగులను సంతరించుకొని పచ్చదనంతో చూపరులను అలరిస్తున్నాయి. 
 
కాగా తిరుమలలో గత రెండు రోజులుగా మండాస్ తుఫాను కారణంగా 210 ఎం.ఎం. వర్షం నమోదు అయిందని అధికారులు తెలిపారు. తిరుమలలోని ఆకాశ గంగా, పాపనాశం, గోగర్భం డ్యాం, కుమార ధర  మరియు పసుపుధార   జలాశయాలు జల కళతో ఉట్టి పడుతున్నాయి. 
 
అదేవిధంగా అక్కగార్ల గుడి వద్ద కురుస్తున్న జలపాతాలు, చెక్ డ్యాంల గుండా ప్రవహిస్తున్న నీటిని, ప్ర‌కృతి ర‌మ‌ణీయ దృశ్యాల‌ను యాత్రికులు త‌మ సెల్‌ఫోన్ల‌లో బంధిస్తున్న దృశ్యాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.