NRIs LARGESSE_ టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.13.5 కోట్లు విరాళం

Tirumala, 14 July 2018: NRIs Sri I Ravi and Sri G Srinivas from USA donated Rs.13.5crores to TTD Hundi and various trusts respectively on Saturday.

Sri Ika Ravi, Founder CEO of Rx Advance, Pharmaceutical company, Boston, USA donated Rs.10crores to TTD Hundi , while Sri Srinivas Guthikonda, CEO of JCG technologies from USA donated Rs.3.50cr which Rs.1 crore to SV Annaprasadam Trust, Rs.1 crore to TTD BIRRD Trust, Rs.1 crore to Sarvasreya Trust, Rs.20 lakhs towards Cottage Donation. Scheme and Rs.10 lakhs each to SVIMS, SV Gosamrakhana and SV Vidyadana Trusts.

Sri Srinivas handed over the DDs to TTD Chairman Sri Putta Sudhakar Yadav in Tirumala temple.

AP Minister Sri Amarnath Reddy, Board members Sri Sandra Venkata Veeraiah, Sri Ramesh Babu, special invitees Sri Raghavendra Rao, Sri Ashok Reddy were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.13.5 కోట్లు విరాళం

మార్చి 14, తిరుమల 2018: అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు శ్రీ ఐ.రవి మరియు శ్రీ జి.శ్రీనివాస్‌లు టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.13.5 కోట్లు విరాళంగా అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శనివారం ఉదయం ఈ విరాళం డిడిలను దాతలు టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు అందచేశారు.

అమెరికాలోని బోస్టన్‌ నగరంలో ఆర్‌ఎక్స్‌ అడ్వాన్స్‌, ఫార్మ పరిశ్రమ వ్యవస్థాపకులు మరియు సిఇవో శ్రీ ఐకా.రవి రూ.10 కోట్లలను శ్రీవారి హుండికి విరాళంగా అందించారు.

అదేవిధంగా గుత్తికొండ శ్రీనివాస్‌ రూ.3.5 కోట్లను టిటిడిలోని వివిధ ట్రస్టులకు విరాళంగా అందించారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి రూపాయలు, సర్వశ్రేయోట్రస్టుకు రూ.కోటి రూపాయలు, బర్డ్‌ ట్రస్టుకు రూ. కోటి రూపాయలు, శ్రీబాలాజీ ఆరోగ్యవరప్రసాదిని పథకానికి రూ. 10 లక్షలు, విద్యాదానం ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు, కాటేజి డొనేషన్‌ స్కీమ్‌లో భాగంగా నందకం అతిది భవనంకు రూ.20 లక్షలు అందించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు గౌ||శ్రీ అమరనాథరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ పొట్లూరి రమేష్‌బాబు, శ్రీసండ్ర వెంకటవీరయ్య, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ రాఘవేంద్రరావు, శ్రీ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.