ASTABANDHANA BALALAYA MAHA SAMPROKSHANAM IN TIRUMALA TEMPLE FROM AUGUST 12 TO 16_ ఆగస్టు 12 నుండి 16వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ : టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

ANKURARPANAM ON AUGUST 11

Tirumala, 14 July 2018: To avoid inconvenience to the pilgrims, TTD Board has resolved to cancel Lord’s darshan from August 11 to August 16 in view of Astabandhana Balalaya Mahasamprokshanam, a unique religious fete, said TTD Board Chairman Sri Putta Sudhakar Yadav.

Briefing the media persons at Annamaiah Bhavan in Tirumala on Saturday after the emergency Board Meeting, the Chairman said, this unique religious fete takes place once in 12 years in Tirumala shirne. “This religious fete commences with Ankurarpanam on August 11. This holy fete commences on August 12 and concludes on August 16. As the importance will be for vedic rituals inside the temple, the time for providing darshan to pilgrims will be very minimal. Our past history speaks that during the second week of August last, over 5.5 lakhs pilgrims visited hill temple. Keeping this in view, we have decided to dispense with darshan to avoid hardship to pilgrim devotees”, the Chairman reiterated.

Adding further he said, the pilgrims will not be allowed to enter Vaikuntham Queue Complex for darshan after 6pm of August 9. The darshan will resume to pilgrims only after 6am from August 17 on wards. “We therefore request the pilgrim devotees of Lord Venkateswara present across the globe to plan their pilgrimage accordingly”, the Chairman appealed to pilgrims via media.

TTD EO Sri Anil Kumar Singhal, board members, Sri Rudraaju Padmaraju, Sri Challa Ramachandra Reddy, Sri S Venkata Veeraiah, Sri Ashok Babu, Sri Rayapati Sambasiva Rao, Sri Peddireddi, Sri Meda Ramakrishna Reddy, Smt Sudha Narayanamurthy, special invitees Sri Raghavendra Rao, Sri Ashok Reddy, Tirumala JEO Sri KS Sreenivasa Raju, Tirupati JEO Sri P Bhaskar were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆగస్టు 12 నుండి 16వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ : టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

జూలై 14, తిరుమల 2018: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం జరుగనున్న నేపథ్యంలో, ఈ 6 రోజుల పాటు స్వామివారి దర్శనాలను పూర్తిగా నిలిపివేశామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ తెలిపారు.

టిటిడి ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం శనివారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. అనంతరం ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకోసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం ఆగస్టు 12 నుండి 16వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 11న అంకురార్పణంతో ఈ వైదిక కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ జరిగే రోజుల్లో వైదిక కార్యక్రమాలు, శాంతిహోమాలకు ఎక్కువ ప్రాధాన్యత వుంటుంది కావున భక్తులకు దర్శనం కల్పించేందుకు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉండటంతో ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు 6 రోజుల పాటు శ్రీవారి దర్శనాలను టిటిడి నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

ఇందులో భాగంగా ఆగస్టు 9వ తేదీ సాయంత్రం 6.00 గంటల నుండి భక్తులను క్యూలైన్లు మరియు వైకుంఠం కంపార్టుమెంట్లలోనికి అనుమతించరని తెలియచేశారు. ఆగస్టు 17వ తేదీ ఉదయం 6.00 గంటల నుండి భక్తులకు దర్శనం పున: ప్రారంభమవుతుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమలయాత్రను రూపొందించుకోవాలని ఛైర్మన్‌ భక్తులకు విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈవోలు శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, శ్రీపోల భాస్కర్‌, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి, శ్రీరాయపాటి సాంబశివరావు, శ్రీ ఇ.పెద్దిరెడ్డి, శ్రీ పొట్లూరి రమేష్‌బాబు, శ్రీసండ్ర వెంకటవీరయ్య, శ్రీమతి సుధా నారాయణమూర్తి, శ్రీ రుద్రరాజు పద్మరాజు, శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.