ONE-DAY ANNAPRASADAM DONATION FACILITY FOR RS. 44 LAKHS _ రూ.44 లక్షల విరాళంతో ఒకరోజు అన్నప్రసాద వితరణకు అవకాశం

– DONORS CAN SERVE THEMSELVES
 
Tirumala, 28 February 2025: Sri Venkateswara Annaprasadam Trust of TTD has commenced a one-day donation scheme to provide tasty and hygienic one-day Annaprasadam to lakhs of devotees who come from different countries for Srivari Darshan.
 
At present Rs.44 lakhs will have to be paid for the distribution of Annaprasadan for  one day.  (And in this Rs.10 lakhs for morning breakfast, Rs.17 lakhs each for lunch and dinner) Donors themselves can serve Annaprasadam to the devotees at MTVAC.
 
The name of the donor who makes the donation will be displayed in the Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex(MTVAC).
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 

రూ.44 లక్షల విరాళంతో ఒకరోజు అన్నప్రసాద వితరణకు అవకాశం

•⁠ ⁠దాతలు స్వయంగా వడ్డించవచ్చు

•⁠ ⁠దాతల పేరు ప్రదర్శన

తిరుమల, 2025 ఫిబ్రవరి 28: తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం ప్రారంభించిన విష‌యం విదిత‌మే.

ప్ర‌స్తుతం అన్నప్రసాద వితరణ కోసం విరాళాల‌ వివ‌రాలు

ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. (కాగా ఇందులో ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు) దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు.

విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.