ORIENTATION PROGRAMME TO DEPUTATION OFFICERS HELD_ భక్తులకు ఎలాంటి అసౌకర్యాం కలుగకుండా విధులు నిర్వహించాలి – శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌

Tirumala, 28 Sep. 18: In view of heavy pilgrim rush in the Peratasi month, TTD has deputed 100 officers to man the pilgrim crowd for the next four weeks in Tirumala.

An orientation programme was held in Asthana Mandapam on Friday evening.

Temple DyEO Sri Harindranath has given instructions to the deployed staff about the nature of duty, shift timings etc. While Annaprasadam Special Officer Sri Venugopal also briefed on Annaprasadam services that are being offered to pilgrims with the help of Srivari Seva volunteers in queue lines, compartments, food courts etc. AVSO Vaikuntham, Sri Gangaraju briefed on the various lines which are plunged in to service at Lepakshi Circle and opposite SV Museum in view of the unprecedented crowd in Tirumala.

TTD PRO Dr T Ravi, EE Sri Krishna Reddy were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తులకు ఎలాంటి అసౌకర్యాం కలుగకుండా విధులు నిర్వహించాలి – శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌

సెప్టెంబరు 28, తిరుమల 2018: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం పెరటాశి నెల, దసర సెలవులు, శ్రీవారి నవరాత్రి బ్రమ్మోత్సవాల సందర్భంగా విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాం కలుగకుండా డెప్యూటేషన్‌ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌ అధికారులను కోరారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో శుక్రవారం సాయంత్రం టిటిడి డెప్యూటేషన్‌ అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు డెప్యూటేషన్‌ సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాం కలుగకుండా విధులు నిర్వహించాలన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందించాలని, క్యూలైన్లలో మరింత మెరుగైన పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా క్యూలైన్లు, భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు క్రమబద్దీకరించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయంతో పని చేయాలన్నారు. అనంతరం టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి, అన్నప్రసాదం విభాగం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, ఈఈ శ్రీ కృష్ణారెడ్డి, ఎవిఎస్వో శ్రీ గంగరాజు తమ విభాగాల సిబ్బందికి అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో దాదాపు 100 మందికి పైగా డెప్యూటేషన్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.