APPALAYAGUNTA PAVITROTSAVAMS POSTERS RELEASED_ అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

Tiruchanoor, 28 Sep. 18: The annual Pavitrotsavams in Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta will be observed from October 5 to 7 with Ankurarpanam on October 4.

Temple Spl.Gr.DyEO Sri P Munirathnam Reddy released the posters for the same in his chambers in Tiruchanoor on Friday.

AEO Sri Subramanyam, Temple Inspector Sri Srinivas were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

తిరుపతి, 2018 సెప్టెంబరు 28: టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 5 నుండి 7వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల గోడపత్రికలను శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి ఆవిష్కరించారు. తిరుచానూరులోని డెప్యూటీ ఈవో కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది.

అక్టోబరు 4న సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు. అక్టోబరు 5న ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు పవిత్ర ప్రతిష్ఠ, అక్టోబరు 6న ఉదయం 10 నుండి 11 గంటల వరకు పవిత్ర సమర్పణ, అక్టోబరు 7న రాత్రి 7.30 నుండి 8 గంటల వరకు మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, అప్పలాయగుంట ఆలయ టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.