PALAMANER TEAMS TOPS IN 24th INTER SV MAHILA POLYTECHNIC SPORTS MEET _ శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో ముగిసిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్

Tirupati, 20 Dec. 19: The Plamner team emerged overall champions in the 24th inter- SV Mahila Polytechnics sports and games meet which concluded on Friday.  Kum B Leshma a second-year student in DPPC (Diploma in commercial and computer practices) of the S Padmavathi Polytechnic also was adjudged as the individual champion.

The two-day sports and games meet hosted by the TTD and the Department of Technical Education of AP Govt. grandly concluded in a festive note on Friday 

TTD DEO Dr Ramana Prasad distributed the prizes to the winner at the Sri Padmavathi Mahila Polytechnic college premises in Tirupati.

 Trophies were also presented to record achieving teams in 100 meters, 200 meters 400 and 800 meters running, 100×4 relay and jump, triple jump, shot-put, and disc-throw, volleyball, kho-kho, badminton, (singles and doubles), Table tennis (singles and doubles) and Chess.

Students and sports girls from 29 polytechnic institutions, and faculty participated in the annual sports and games meet held under the supervision of Dr. G.Asunta, Principal of the SP Mahila Polytechnic, Tirupati.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో ముగిసిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్

ఓవ‌రాల్ ఛాంపియ‌న్‌షిప్‌ ప‌ల‌మ‌నేరు పాలిటెక్నిక్ జ‌ట్టు

వ్య‌క్తిగ‌త ఛాంపియ‌న్‌గా బి.లేష్మ‌

తిరుప‌తి, 20 డిసెంబ‌రు 2019: రాష్ట్ర ప్ర‌భుత్వ సాంకేతిక విద్యాశాఖ‌, టిటిడి ఆధ్వ‌ర్యంలోని శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల సంయుక్తంగా నిర్వ‌హించిన 24వ బాలిక‌ల జిల్లాస్థాయి అంత‌ర‌ పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ శుక్ర‌వారం వేడుక‌గా ముగిసింది.

శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన ముగింపు కార్య‌క్ర‌మంలో టిటిడి విద్యాశాఖాధికారి డా.ఆర్‌.ర‌మ‌ణ‌ప్ర‌సాద్ విజేత‌ల‌కు బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు. ఈ క్రీడ‌ల్లో ఓవ‌రాల్ ఛాంపియ‌న్‌గా ప‌ల‌మ‌నేరు బాలిక‌ల పాలిటెక్నిక్ క‌ళాశాల జ‌ట్టు నిలిచింది. శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాలలో డిప్లొమా ఇన్ క‌మ‌ర్షియ‌ల్ అండ్ కంప్యూట‌ర్ ప్రాక్టీస్‌(డిసిసిపి) కోర్సు రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్న బి.లేష్మ వ్య‌క్తిగ‌త ఛాంపియ‌న్‌గా నిలిచింది.

కాగా, 100 మీట‌ర్లు, 200 మీట‌ర్లు, 400 మీట‌ర్లు, 800 మీట‌ర్ల ర‌న్నింగ్‌, 100×4 రిలే, బ్రాడ్ జంప్‌, ట్రిపుల్ జంప్‌, షాట్‌పుట్‌, డిస్క‌స్ త్రో, వాలీబాల్, ఖో-ఖో, బ్యాడ్మింట‌న్(సింగిల్స్‌, డ‌బుల్స్‌), టేబుల్ టెన్నిస్‌(సింగిల్స్‌, డ‌బుల్స్‌), చెస్ పోటీల్లో విజేత‌లుగా నిలిచిన క్రీడాకారిణుల‌కు ట్రోఫీలు ప్ర‌దానం చేశారు. విజేత‌ల వివ‌రాల‌ను జ‌త‌ప‌ర‌చ‌డ‌మైన‌ది.

శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల ప్రిన్సిపాల్ డా. జి.అసుంత ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో క‌ళాశాల అధ్యాప‌కులు, 29 పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల నుండి వ‌చ్చిన క్రీడాకారిణులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.