PARTIAL LUNAR ECLIPSE ON OCTOBER 29 _ అక్టోబర్ 29న పాక్షిక చంద్రగ్రహణం
TEMPLE DOORS TO REMAIN SHUT FOR 8 HOURS
Tirumala, 26 October 2023: Owing to partial Lunar eclipse during the wee hours of October 29 the Tirumala temple will remain closed on the night of October 28 and reopened on October 29.
The partial Chandra Grahanam occurs between 1:05am and 2:22am on October 29. As such the temple doors will be closed at 7:05pm on October 28 and reopened at 3:15am on October 29 after performing Suddhi and Suprabhata seva in Ekantam. The Tirumala temple doors remains closed for eight hours due to Chandra Grahanam.
Sahasra Deepalankara Seva, differently abled and senior citizens darshan stands cancelled on October 28. Even Annaprasadam activity will be stalled at all venues in Tirumala by 6pm.
The devotees are requested to make note of this and plan their pilgrimage accordingly to avoid inconvenience.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అక్టోబర్ 29న పాక్షిక చంద్రగ్రహణం
– 8 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూత
తిరుమల, 2023, అక్టోబరు 26: అక్టోబర్ 29వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అక్టోబర్ 28న రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేసి అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తారు. దాదాపు ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి.
అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1.05 నుండి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. ఈ కారణంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని అక్టోబరు 28న సాయంత్రం 6 గంటలకు మూసివేసి అక్టోబరు 29న ఉదయం 9 గంటలకు తెరుస్తారు. ఈ సమయంలో అన్నప్రసాదాల పంపిణీ ఉండదు. అదేవిధంగా, అక్టోబర్ 28న సహస్రదీపాలంకారసేవను, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాలను గమనించి అసౌకర్యానికి గురికాకుండా తిరుమల యాత్రకు ప్రణాళిక రూపొందించుకోవాలని కోరడమైనది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.