PAVITROTSAVAMS IN TIRUMALA_ ఆగస్టు 21 నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
Tirumala, 4 August 2018: The annual Pavitrotsavams in Tirumala temple will be observed from August 21 to 23 with Ankurarpanam on August 20.
This “Sin Free” festival was said to have first introduced in 16th Century and again reinstated by TTD in 1962.
TTD has cancelled Astadalapada Padmaradhana, Sahasra Kalasabhishekam, Tirppavada seva, Kalyanotsavam, Unjal seva, Arjitha Brahmotsavam, Vasanthotsavam, Sahasra Deepalankara Seva during these days.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 21 నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
ఆగస్టు 04, తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 21 నుంచి 23వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 20న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుంచి రాత్రి 8.00 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 21న పవిత్రాల ప్రతిష్ట, ఆగస్టు 22న పవిత్ర సమర్పణ, ఆగస్టు 23న పూర్ణాహుతి నిర్వహిస్తారు.
ఆర్జితసేవలు రద్దు :
పవిత్రోత్సవాల నేపథ్యంలో ఆగస్టు 20న వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి. ఆగస్టు 21 నుండి 23వ తేదీ వరకు అష్టదళ పాదపద్మారాధన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడసేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకారసేవలు రద్దయ్యాయి.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.