CHAKRATTALWAR SATTUMORA ON AUGUST 10_ ఆగస్టు 10న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ చక్రత్తాళ్వార్‌ సాత్తుమొర

Tirupati, 4 August 2018: The Chakrattalwar Sattumora and Sri Prativadi Bhayankara Annan Sattumora will be observed in connection with Andal Tiruvadipudi Nakshatrotsavam in Sri Govindaraja Swamy temple in Tirupati on August 10.

In this connection there will be procession of deities from Sri Lakshmi Narayana Swamy temple. While in the evening the Appa Padi Prasadam which was brought from Tirumala temple will be taken round on a procession from Sri Kodanda Rama Swamy temple to Sri Lakshmi Narayana Swamy vari temple.

Later in the evening, Sri Devi and Bhu Devi sametha Sri Govindaraja Swamy will be taken on a procession along with Chakrattalwar in the four mada streets. The procession of Andal Sri Goda will also be observed. The temple officials will take part in this fete.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 10న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ చక్రత్తాళ్వార్‌ సాత్తుమొర

తిరుపతి, 2018 ఆగస్టు 04: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 10వ తేదీ శుక్రవారం శ్రీచక్రత్తాళ్వార్‌ సాత్తుమొర, శ్రీ ప్రతివాది భయంకరన్‌ అన్నన్‌ సాత్తుమొర ఘనంగా జరుగనున్నాయి. శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం ఉత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయం నుంచి ఉదయం 8.00 నుంచి 9.30 గంటల వరకు ఉభయనాంచారులతో కూడిన శ్రీ వరదరాజస్వామివారిని, శ్రీప్రతివాది భయంకరన్‌ అన్నన్‌ను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. ఉదయం 9.30 నుంచి 10.00 గంటల వరకు తిరుమల నుంచి వచ్చిన శ్రీవారి అప్పపడి ప్రసాదాన్ని శ్రీకోదండరామాలయం నుంచి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొస్తారు.

సాయంత్రం 4.00 నుండి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని, శ్రీ చక్రత్తాళ్వార్‌ను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆండాళ్‌ అమ్మవారి ఊరేగింపు ఉంటుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.