PAVITRA PRATISTA IN NARAPURA TEMPLE_ జమ్మలమడుగులోని శ్రీనరపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ

Tirupati, 8 Sep. 19: As a part of annual Pavitrotsavam, Pavitra Pratista was performed to Sri Narapura Venkateswara Swamy temple in Jammalamadugu of YSR Kadapa district on Sunday.

Chatuatarchana, Punyahavachanam and Yagashalapuja were performed on first day while in the evening Nitya Homam will be performed.

On September 9, Pavitra Samarpana and September 10 Pavitra Purnahuti will be performed.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జమ్మలమడుగులోని శ్రీనరపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ

తిరుపతి, 2019 సెప్టెంబ‌రు 08: టిటిడికి అనుబంధంగా ఉన్న వైఎస్‌ఆర్‌ కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాల మొదటిరోజు ఆదివారం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ జరిగింది. ఇందులో భాగంగా ఉదయం చతుష్ఠార్చ‌న, పుణ్యాహవచనం, యాగశాలపూజ నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు నిత్య హోమం నిర్వహిస్తారు.

అదేవిధంగా, సెప్టెంబరు 9న‌ ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం పవిత్ర హోమం చేప‌డ‌తారు. సెప్టెంబరు 10న ఉదయం 6 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వరకు మహాపూర్ణాహుతి, సాయంత్రం స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం, పవిత్ర వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.