PAVITROTSAVAM AT SRI KRT FROM AUG 4 TO 6 _ ఆగస్టు 4 నుండి 6వ తేదీ వరకు శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు
Tirupati, 2 August 2021: TTD is organising annual Pavitrotsavam Mahotsavam at Sri Kodandarama Swamy temple from August 4 to 6 in Ekantham in view of Covid guidelines.
As part of festivities of the three day event Ankurarpanam will be performed on August 3 evening in the temple beside the Acharya Ritwick Varanam, Senadhipati utsavam, Medini Puja, Mritsangrahanam rituals.
On August 4, the first day of mahotsavam, Pavitra pratista shall be performed at Yagashala and Pavitra samarpana on August 5 and on August 6, the Purnahuti and other vaidika rituals will herald the conclusion.
On all three days Snapana Tirumanjanam will be performed for the utsava idols of Sri Sitarama sameta Lakshmana Swamy in the morning and Asthana will be held at Bashyakarula Sannidhi in the evening.
The pavitrotsavam is an annual event performed at all the Vaishnava temples after the Brahmotsavam festival to cleanse the temple and ward of bad effects of any lapses occurred during the year and to enhance the divinity of the temple.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఆగస్టు 4 నుండి 6వ తేదీ వరకు శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు
తిరుపతి, 2021 ఆగస్టు 02: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 4 నుండి 6వ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగనున్నాయి. ఇందుకోసం ఆగస్టు 3న ఉదయం ఆచార్య రుత్విక్‌వరణం, సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, మేదినిపూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా ఆగస్టు 4న మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ట, శయనాధివాసం, ఆగస్టు 5న రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 6న మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ మూడు రోజుల పాటు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం జరుగనుంది. సాయంత్రం భాష్యకార్ల సన్నిధిలో ఆస్థానం చేపడతారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.