CVSO INSPECTS ONGOING WORKS _ తిరుమలలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను తనిఖీ చేసిన‌ సివిఎస్వో

TIRUMALA, 02 AUGUST 2021: TTD CVSO Sri Gopinath Jatti along with Engineering, Forest and Vigilance officials inspected various places at Tirumala and also the ongoing improvements in the Alipiri footpath route on Monday.

As a part of his inspection along with SE 2 Sri Jagadeeshwar Reddy, he visited the old viewpoint near GNC and suggested to the Engineering and Forest officials on the necessary improvements and greenery to be done in these places. 

Later he also walked to the Jackfruit Vanam located near GNC, the entrance of Outer Ring Road to see the ongoing improvement works.

INSPECTS RENOVATED GHURKHA POST

As a part of his inspection, the CVSO also visited the renovated Gurkha Security Post located adjacent to Sri Lakshmi Narasimha Swamy temple in the footpath route. During his previous inspection, he noticed that this security post which accommodates Ghurkhas who are on Ghat road vigil duty, was out of shape. He inaugurated the post and appreciated the services of Ghurkhas who hails from Nepal, Darjeeling etc. and later dined with them.

Among others who were present in the inspection includes EE 1 Sri Jaganmohan Reddy, DFO Sri Chandrasekhar, VGO Sri Bali Reddy, AVSOs Sri Gangaraju, Sri Pawan Kumar, Sri Sailendra and others.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను తనిఖీ చేసిన‌ సివిఎస్వో

 తిరుమల, 2021 ఆగ‌స్టు 02: తిరుమలలో వివిధ ప్రాంతాల్లో, అలిపిరి న‌డ‌క మార్గంలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను సోమ‌వారం టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి ఇంజనీరింగ్, అట‌వీ, విజిలెన్స్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు.

ఈ సంద‌ర్భంగా సివిఎస్వో జిఎన్‌సి సమీపంలోని పాత వ్యూ పాయింట్‌ను సందర్శించి, అక్క‌డ అవ‌స‌ర‌మైన అభివృద్ధి, పచ్చదనం పెంపొందించేందుకు చెప‌ట్ట‌వ‌ల‌సిన ప‌నుల‌ను ఇంజనీరింగ్, అటవీ అధికారులకు సూచించారు. తరువాత జిఎన్‌సి సమీపంలోని ప‌న‌స వనం, ఔటర్ రింగ్ రోడ్‌లోని అభివృద్ధి పనులను ప‌రిశీలించారు.

త‌నిఖీల్లో పునరుద్ధరించిన ఘూర్ఖా పోస్ట్ :

సివిఎస్వో తనిఖీలో భాగంగా అలిపిరి న‌డ‌క‌మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆల‌యం ప్రక్కన ఆధునీక‌రించిన గూర్ఖా సెక్యూరిటీ పోస్ట్‌ని సందర్శించారు. ఇదివ‌ర‌కు ఆయ‌న తనిఖీ సమయంలో ఘాట్ రోడ్ విధుల్లో ఉన్న ఘూర్ఖాస్‌కి ఉండే ఈ సెక్యూరిటీ పోస్ట్ సౌక‌ర్య‌వంతంగా లేదని గమనించి ఆధునీక‌రించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అన్ని వ‌స‌తుల‌తో ఆధునీక‌రించిన ఘూర్ఖా పోస్ట్‌ను ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా నేపాల్, డార్జిలింగ్ మొదలైన ప్రాంతాలకు చెందిన ఘూర్ఖాస్ రాత్రి, ప‌గలు విశేషంగా సేవలు అందిస్తున్నార‌ని ప్రశంసించారు. త‌రువాత వారితో కలిసి సివిఎస్వో భోజనం చేశారు.

తనిఖీలో ఎస్ఇ- 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డిఎఫ్‌వో శ్రీ చంద్రశేఖర్, ఈఈ 1 శ్రీ జగన్మోహన్ రెడ్డి, విజివో శ్రీ బాలి రెడ్డి, ఎవిఎస్వోలు శ్రీ గంగరాజు, శ్రీ పవన్ కుమార్, శ్రీ శైలేంద్ర ఉన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.