PAVITROTSAVAM IN SRI LAKSHMI NARASIMAHASWAMY TEMPLE AT TARIGONGA FROM SEP 21_ సెప్టెంబరు 21 నుండి 23వ తేదీ వరకు తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

Tirupati, 20 September 2017: The holy 3 day event of Pavitrotsavam will be performed at the Sri Lakshmi Narasimhaswamy temple in Tarigonda from Sept.21.

Ankurarpanam will be performed Wednesday evening. The ritual is aimed to cleanse the mishappenings in the temple complex during the year and include Punya Vahanam and Alaya shuddi rituals.

Interested devotee couple are requested to participate at a contribution of Rs.300 per day and will be presented one Pavitra mala, one uttareyam, one blouse piece and Anna prasadam.

Cultural activities including bhakti sangeet and harikatha will be performed by the artists of HDPP, Annmacharya project and Dasa Sahitya.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

సెప్టెంబరు 21 నుండి 23వ తేదీ వరకు తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

సెప్టెంబర్‌ 20, తిరుపతి, 2017 : టిటిడి అనుబంధ ఆలయమైన చిత్తూరు జిల్లా తరిగొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 21 నుండి 23వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. బుధవారం సాయంత్రం అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మ తాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన సెప్టెంబరు 21న పవిత్రప్రతిష్ఠ, స్వామి,అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రెండో రోజు సెప్టెంబరు 22న పవిత్ర సమర్పణ చేస్తారు. చివరిరోజు సెప్టెంబరు 23వ తేదీన ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, పవిత్ర విసర్జన, మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.

గహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఒకరోజు పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గ హస్తులకు ఒక పవిత్రమాల, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.