PAVITROTSAVAMS CONCLUDES IN JAMMALAMADUGU TEMPLE _ పూర్ణాహుతితో ముగిసిన శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ప‌విత్రోత్స‌వాలు

TIRUPATI, 18 SEPTEMBER 2021:  The annual Pavitrotsavams in Sri Narapura Venkateswara Swamy temple at Jammalamadugu in YSR Kadapa district concluded on a religious note with Purnahuti on Saturday.

Deputy EO Sri Ramanaprasad, AEO Sri Muralidhar and other temple staff participated in this fete observed in Ekantam due to Covid norms.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ప‌విత్రోత్స‌వాలు

తిరుపతి, 2021 సెప్టెంబ‌రు 18: వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ‌నివారం పూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన జ‌రిగింది. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఉద‌యం 6 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి చ‌తుష్టానార్చాన‌, మహాపూర్ణాహుతి, ప‌విత్ర విస‌ర్జ‌న‌, కుంభ‌ప్రోక్ష‌ణ నిర్వ‌హించారు. సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్లను ఆల‌యంలో ఊరేగించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో జ‌న‌ర‌ల్ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ర‌మ‌ణ‌ప్ర‌సాద్‌, ఆల‌య ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ మునికుమార్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది