PAVITROTSAVAMS CONCLUDES IN SRI KRT_ ఘనంగా ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు

Tirupati, 9 August 2018: The annual Pavitrotsavams in Sri Kodanda Rama Swamy temple in Tirupati culminated on Thursday with Purnahuti.

During the day vaidika rituals took place in Yagashala while Snapana Thirumanjanam was performed to deities between 12noon and 1pm.

In the night, Purnahuti was performed in Yagashala.

Meanwhile there will be Sahasra Kalasabhishekam on August 11.

Temple DyEO Smt Jhansi Rani, AEO Sri Tirumalaiah, Temple Supdt Sri Munikrishna Reddy, Temple Inspector Sri Sesha Reddy and devotees took part.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఘనంగా ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు

తిరుపతి, 2018 ఆగస్టు 09: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు గురువారం రాత్రి పూర్ణాహుతితో ఘనంగా ముగియనున్నాయి. ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం, భాష్యకార్ల గుడి వద్ద యిహల్‌ శాత్తుమొర నిర్వహించారు. రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. రాత్రి 8.30 నుండి 10.00 గంటల వరకు పూర్ణాహుతి, ఉత్సవమూర్తులను, ప్రధాన కుంభాన్ని విమాన ప్రదక్షిణంగా సన్నిధికి చేర్చడం, కుంభా ఆవాహన తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీతిరుమలయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ మునిక్రిష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శేషారెడ్డి, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఆగస్టు11న సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ

శ్రీకోదండరామాలయంలో ఆగస్టు 11వ తేదీ శనివారం అమావాస్యనాడు సహస్రకలశాభిషేకం, హనుమంత వాహనసేవ వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా శనివారం నాడు మూలవర్లకు నిర్వహించే అభిషేకంను ఉదయం 4.30 గంటలకు నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా ఉదయం 6.00 నుండి 8.00 గంటల నడుమ సహస్ర కలశాభిషేకంసేవ వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.

సాయంత్రం 7.00 నుంచి రాత్రి 9.00 గంటల నడుమ హనుమంత వాహనసేవ జరుగనుంది. హనుమంతుడిని ‘సంకట మోచన’గా పిలుస్తారు. అనగా దుష్టశక్తులను నశింపజేసి చెడు ఆలోచనలను దూరం చేస్తాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రం తదితర పర్వదినాలకు చాలా విశిష్టత ఉంటుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.