PAVITROTSAVAMS POSTERS RELEASED _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

Srinivasa Mangapuram 19 oct 19 ;The annual Pavitrotsavams in Sri Kalyana Venkateswara Swamy temple will be organised from October 24 to 26 with Ankurarpanam on October 23.

JEO Sri P Basant Kumar has released the posters related to the fete in his chambers on Saturday.

Temple DyEO Sri Ellappa and Temple Inspector Sri Anil were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

తిరుపతి, 2019 అక్టోబరు 19 ;శ్రీనివాసమంగాపురంలో కొలువైన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో అక్టోబరు 24 నుండి 26వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల గోడపత్రికలను జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్‌ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని కార్యాలయంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది.

 ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ అక్టోబరు 23వ తేదీన సాయంత్రం 6.00 గంటలకు మత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభవుతాయన్నారు.

పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 24వ తేదీన  రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు పవిత్రప్రతిష్ఠ, రెండవ రోజు అక్టోబరు 25వ తేదీన మధ్యాహ్నం 12.00 నుండి 1.00 గంట వరకు పవిత్ర సమర్పణ చేస్తారన్నారు. చివరిరోజైన అక్టోబరు 26వ తేదీ రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయన్నారు.

 పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారన్నారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.  

 గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒకరోజు పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రమాల, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. పవిత్రోత్సవాల కారణంగా అక్టోబరు 24 నుండి 26వ తేదీ వరకు ఆర్జిత కల్యాణోత్సవం, అష్టోత్తర శత కళశాభిషేకం సేవను టిటిడి రద్దు చేసింది.

 వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

 ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ యలప్ప, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ అనిల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.