PEACE THROUGH SPIRITUALITY-CHAGANTI _ భ‌క్తితోనే మాన‌వుల‌కు శాంతి : బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Tirupati, 13 Jan. 20: Peace shall be acquired only by pracricing Spirituality,  said noted philosopher and spiritual exponent Brahmasri Chaganti Koteswara Rao. 

On the second day evening of the two day vedic discourse organized by SV Higher Vedic Studies at Geeta Maidanam in SV High School grounds on Monday evening,  the spiritual scholar said, one should think of the ways and means to attain salvation from this materialistic world by the way of Bhakti. 

SVHVS OSD Dr A Vibhishana Sharma and a huge gathering of locals were also present. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

భ‌క్తితోనే మాన‌వుల‌కు శాంతి : బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

 తిరుప‌తి, 2020 జనవరి 13: భ‌క్తి త‌ల్లి లాంటిద‌ని, భ‌క్తితో ఉన్నవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటార‌ని, దీనివ‌ల్ల‌నే మాన‌వుల‌కు శాంతి చేకూరుతుంద‌ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. తిరుప‌తిలోని ఎస్వీ హైస్కూల్ మైదానంలో గ‌ల గీతా జ‌యంతి వేదిక‌పై టిటిడి శ్రీ వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ఆధ్వ‌ర్యంలో  “వేద సంస్కృతి – భ‌క్తి వైభ‌వం” అనే అంశంపై రెండు రోజులపాటు జ‌రిగిన ధార్మికోపన్యాసాలు సోమ‌వారం ముగిశాయి.

ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉపన్యసిస్తూ భౌతిక‌మైన శ‌రీరం గురించి ఆలోచించ‌కుండా భ‌గ‌వంతునిలో ఐక్య‌మ‌య్యేందుకు సిద్ధ‌ప‌డే స్థితి ఉన్న‌త‌మైన భ‌క్తికి తార్కాణ‌మ‌న్నారు. భ‌గ‌వంతుడు పంచేంద్రియాల‌తో మ‌నిషిని సృష్టించి ధ‌ర్మ‌, అర్థ‌, కామ, మోక్షాల‌నే చ‌తుర్విద పురుషార్థాల‌ను నిర్దేశించాడ‌ని తెలియ‌జేశారు. స‌రైన మార్గంలో వీటిని పాటించిన వారు ఉన్న‌త‌మైన స్థితికి చేరుకుంటార‌ని తెలిపారు. అపార‌మైన ద‌య భ‌గ‌వంతుని ల‌క్ష‌ణ‌మ‌ని, దాన్ని తెలుసుకోవ‌డం ఎవ‌రిత‌ర‌మూ కాద‌ని అన్నారు. భార‌తీయ జీవ‌న విధానం వేద సంస్కృతితో ముడిప‌డి ఉంద‌ని, వేదం భ‌క్తిమార్గాన్ని బోధిస్తుంద‌ని తెలియ‌జేశారు.    
     
ముందుగా ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థకు చెందిన వేదపండితులు ఒక గంట పాటు నాలుగు వేదాలతో వేదస్వస్తి నిర్వహించారు.

ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో నగరవాసులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.