SANKRANTI GREETINGS EXTENDED _ టిటిడి ఛైర్మన్‌, ఈవో మకర సంక్రాంతి శుభాకాంక్షలు

Tirumala, 13 Jan. 20: TTD Chairman Sri YV Subba Reddy,  EO Sri Anil Kumar Singhal,  Additional EO Sri AV Dharma Reddy,  JEO Sri P Basanth Kumar,  CVSO Sri Gopinath Jatti greeted pilgrims a happy Bhogi,  Sankranti and Kanuma greetings.

They wished all to have prosperous life with good harvests this year on this celestial occasion.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి ఛైర్మన్‌, ఈవో మకర సంక్రాంతి శుభాకాంక్షలు
 
తిరుప‌తి, 2020 జనవరి 13: టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శ్రీవారి భక్తులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల్లో రైతన్నలు కనుమ పండుగ నాడు గోపూజ చేసి గోసంరక్షణకు పాటుపడాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.
 
అదేవిధంగా, టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, తిరుపతి జెఈఓ శ్రీ బసంత్ కుమార్ స్పందిస్తూ ఆ దేవదేవుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారి కృపాకటాక్షాలతో ఈ పర్వదినాన్ని భక్తులందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.