PEDESTRIAN PILGRIMS ARE ELATED OVER SLOT-WISE DARSHAN – JEO_ కాలినడక భక్తులకు సకాలంలో సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం : తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
Tirumala, 1 August 2017: The pilgrims reaching Tirumala and having darshan of Lord Venkateswara by trekking Alipiri and Srivari Mettu Foot path routes are expressing immense pleasure over the recently introduced slot-wise darshan, asserted TTD Tirumala JEO Sri K S Sreenivasa Raju.
After the review meeting with Engineering, Health, Radio and Broadcasting departments in Annamaiah Bhavan at Tirumala on Tuesday, speaking to media persons, the JEO said, “We have been providing the footpath pilgrims, a comfortable darshan with specific time slot within two and a half hours as assured by us. We have erected the flex boards both at Alipiri and Srivari Mettu with necessary information for the sake of pilgrims. Additional help desks will be placed at Alipiri and Galigopuram and also at Srivari Mettu starting point and at 1200th step. We will also utilise the services of Srivari Sevakulu at the required points. Continuous announcements are being made by Radio and Broadcasting department. The toilets in both the trek paths will be maintained properly by both health and engineering wings”, he added.
NO ANNAPRASADAM ON GRAHANAM DAY
In connection with Chandra Grahanam, on August 7, annaprasadam will not be served in the massive Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex (MTVAC) from 4:30pm on wards. The free food service will commence on August 8by usual time at 9am. “In view of lunar eclipse we are closing the temple doors of Tirumala by 4:30pm and will reopen on August 8 after 2am. Then follows sudhi, punyhavachanam etc. and the sarva darshan for pilgrims commences only after 7am”, the JEO informed.
The JEO later inspected the Narayanagiri Gardens and interacted with the pedestrian pilgrims. He informed them to make use of the slot-wise darshan by reporting at the specified time on the token to avoid long waiting hours. The JEO also received feed back from the pilgrims.
CVSO Sri A Ravikrishna, VGO Sri Ravindra Reddy, DyEO Temple Sri Kodanda Rama Rao, SE II Sri Ramachandra Reddy, GM Sri Sesha Reddy and other senior officers were also present during the inspection.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
కాలినడక భక్తులకు సకాలంలో సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం : తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
ఆగస్టు 01, తిరుమల, 2017 : కాలినడక భక్తులకు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో టోకెన్లు మంజూరు చేయడం ద్వారా నిర్ణీత కాలంలో సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నామని, భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం అధికారులతో జెఈవో వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజూ కాలినడక భక్తులకు అలిపిరి మార్గంలో 14 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 6 వేల టోకెన్లు కలిపి మొత్తం 20 వేల టోకెన్లు జారీ చేస్తున్నామని తెలిపారు. ఈ భక్తులకు ప్రణాళికాబద్ధంగా సూచించిన సమయానికే స్వామివారి దర్శనం కల్పిస్తున్నామన్నారు. కాలినడకన వచ్చే భక్తుల సౌకర్యార్థం అలిపిరి, గాలిగోపురం వద్ద, శ్రీవారి మెట్టు మార్గంలో మొదట్లో, టోకెన్ జారీ కేంద్రం వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేస్తామని తెలిపారు. అక్కడ శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల సందేహాలను నివృత్తి చేస్తామని చెప్పారు.
అంతకుముందు అధికారుల సమావేశంలో జెఈవో మాట్లాడుతూ ఘాట్ రోడ్లు, నడకదారుల్లో చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్యవిభాగం, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం సిబ్బందిని ఏర్పాటుచేసుకోవాలన్నారు. నడకమార్గాల్లో పరిశుభ్రత చర్యలపై భక్తులకు రేడియో, బ్రాడ్‌కాస్టింగ్ విభాగం ద్వారా అనౌన్స్‌మెంట్ చేయాలని సూచించారు.
సమీక్ష తరువాత నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకున్న జెఈఓ అక్కడి దివ్యదర్శనం భక్తులతో మాట్లాడారు. టోకెన్ల జారీ విధానం, ఎప్పుడు రిపోర్ట్ చేయాలి తదితర విషయాలపై అవగాహన కల్పించారు.
శ్రీవారి పుష్కరిణి మరమ్మతులు ప్రారంభం
శ్రీవారి పుష్కరిణి మరమ్మతులను మంగళవారం ప్రారంభించామని, 31 రోజుల పాటు కొనసాగుతాయని జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మూెత్సవాల ముందు పుష్కరిణిలోని నీటిని పూర్తిగా తొలగించి చిన్న చిన్న మరమ్మతులుంటే పూర్తి చేస్తామన్నారు. మిగతారోజుల్లో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా ప్రతిరోజూ కొంత శాతం నీటిని పంపి శుద్ధి చేస్తామన్నారు.
ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు పవిత్రోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయని జెఈవో తెలిపారు. ఆగస్టు 2న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసి కొన్ని, తెలియక జరిగిన దోషాల నివారణకు ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. ఆగస్టు 3న పవిత్ర ప్రతిష్ట, ఆగస్టు 4న పవిత్ర సమర్పణ, ఆగస్టు 5న పూర్ణాహుతి జరుగుతాయన్నారు.
ఆగస్టు 7న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత
చంద్రగ్రహణం కారణంగా ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 4.30 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 2 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నట్టు జెఈవో తెలిపారు. గ్రహణ సమయంలో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాద వితరణ ఉండదని, భక్తులు గమనించాలని కోరారు.
ఆగస్టు 8న ఉదయం 2 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం, సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, అష్టదళ పాదపద్మారాధన అనంతరం ఉదయం 7 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుందని జెఈవో తెలిపారు.
అధికారుల సమీక్షలో టిటిడి సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణ, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, క్యాటరింగ్ అధికారి శ్రీ జిఎల్‌ఎన్.శాస్త్రి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.