FLORAL TRIBUTES PAID TO SAINT POETESS_ తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఘనంగా పుష్పాంజలి

Tirumala, 1 August 2017: On the occasion of 200th Death Anniversary of saint poetess Matrusri Tarigonda Vengamamba, floral tributes have been paid to her life size statue at MR Palle circle in Tirupati on Tuesday.

Dr KJ Krishna Murthy, the Vengamamba Project co-ordinator offered pushpanjali and remembered the great literary works penned by the saint poetess. He also said she has pioneered Annaprasadam in Tirumala.

Later in the evening special devotional programmes have been organised at Annamacharya Kalamandiram where the artistes have presented some of the great songs written by Vengamamba.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఘనంగా పుష్పాంజలి

ఆగస్టు 01, తిరుమల, 2017 మాత శ్రీ తరిగొండ వెంగమాంబ 200వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు సమన్వయాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి మంగళవారం ఘనంగా పుష్పాంజలి సమర్పించారు.

ఈ సందర్భంగా ఆచార్య కె.జె.కృష్ణమూర్తి మాట్లాడుతూ శ్రీవారి ఆపర భక్తురాలైన మాత శ్రీ తరిగొండ వెంగమాంబ తిరుమలలో మొదటగా అన్నప్రసాద వితరణను ప్రారంభించారని చెప్పారు. వెంగమాంబ శ్రీవారి ఆలయంలో ప్రవేశపెట్టిన ముత్యాలహారతి నేటికీ కొనసాగుతోందని ఆయన వివరించారు. వెంగమాంబ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ భక్తితత్వాన్ని వ్యాప్తి చేస్తున్నట్టు తెలిపారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.